News March 16, 2024
మామ, అల్లుడు మధ్య రసవత్తరమైన పోరు
పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ పోటీ చేయనున్నారు. ఈయన భాష్యం విద్య సంస్థల్లో భాగస్వామిగా ఉన్నారు. అలాగే భాష్యం డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు స్వయాన ప్రవీణ్‌కి చిన్న మామ. శంకర్ రావు అన్నయ్య కూతురిని ప్రవీణ్ వివాహం చేసుకున్నారు. దీంతో ఈసారి మామ, అల్లుడు మధ్య పోరు రసవత్తరంగా మారింది.
Similar News
News October 7, 2024
గుంటూరు: కిడ్నాన్‌నకు గురైన చిన్నారి ఆచూకీ లభ్యం
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో <<14296760>>అపహరణకు గురైన పసికందు<<>> ఆచూకీ లభ్యమైంది. ఘటన పోలీసుల దృష్టికి వచ్చిన గంటల వ్యవధిలోనే పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్తపేట సీఐ సోమయ్య ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా నలుమూలల జల్లెడ పట్టారు. దీంతో అచ్చంపేట మండలం కోనూరులో బిడ్డ ఆచూకీ లభ్యమైంది. మరో గంటలో ఆ బిడ్డను పోలీసులు తల్లి ఒడికి చేర్చనున్నారు. బిడ్డ దొరకడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News October 7, 2024
అమరావతి: టమాటా, ఉల్లి ధరల పెరుగుదలపై సమీక్ష
టమాటా, ఉల్లి ధరలు పెరుగుదల అంశంపై అమరావతి సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాట, ఉల్లి కొనుగోళ్లు చేసి రైతు బజార్లలో విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు. ధరల పెరుగుదలను నియంత్రించి సాధారణ ధరలకు విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు.
News October 7, 2024
గుంటూరు: డిప్లొమా పరీక్షల టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్)పరిధిలో ఫుడ్ ప్రొడక్షన్, సైకలాజికల్ గైడెన్స్&కౌన్సెలింగ్‌లో డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన ఇయర్ ఎండ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఈ నెల 27 నుంచి నవంబర్ 1 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.