News September 2, 2024

ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం

image

కోల్‌క‌తాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన ఆర్జీ క‌ర్ మెడిక‌ల్ కాలేజీ మాజీ ప్రిన్సిప‌ల్ సందీప్ ఘోష్‌ను CBI అరెస్టు చేసింది. ఘోష్ హ‌యాంలో ఆస్ప‌త్రిలో జ‌రిగిన ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లు తాజాగా వెలుగు చూశాయి. ఈ విష‌య‌మై CBI ఇప్ప‌టికే కేసు న‌మోదు చేసి ప్రశ్నించింది. ఆయనకు సంబంధించిన 15ప్రాంతాల్లో సోదాలు కూడా చేసింది. FIRలో ఘోష్ పేరు న‌మోదు చేసిన కొన్ని రోజుల‌కే CBI ఆయ‌న్ను అరెస్టు చేయడం గమనార్హం.

Similar News

News September 21, 2024

సంచలనం.. SAపై అఫ్గాన్ భారీ విజయం

image

సౌతాఫ్రికాపై రెండో ODIలో అఫ్గాన్ 177 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో తొలిసారి ఆ జట్టుపై 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. అఫ్గాన్ 311/4 స్కోర్ చేయగా, SA 34.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. రషీద్ 5, ఖరోటే 4 వికెట్లు తీశారు. బవుమా 38, జోర్జి 31, మార్‌క్రమ్ 21, హెండ్రిక్స్ 17 మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. అఫ్గాన్ బ్యాటర్లలో గుర్బాజ్ 105, అజ్మతుల్లా 86, రహ్మత్ 50 అదరగొట్టారు.

News September 21, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 21, 2024

అమ్మో.. ఈ కార్లకు అంత ధరా..?

image

ఈ ఏడాది అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో తొలి 2స్థానాలను రోల్స్ రాయిస్ దక్కించుకుంది. అగ్రస్థానంలో రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్‌టెయిల్(ధర రూ.251 కోట్లకు పైమాటే), రెండో ప్లేస్‌లో బోట్ టెయిల్(రూ.234 కోట్లు), రూ.156 కోట్లతో బుగాటీ లా వోయిచర్ నోయిర్ 3వ స్థానంలో నిలిచాయి. పగానీ జోండా హెచ్‌పీ బార్చెటా(రూ.142 కోట్లు), ఎస్పీ ఆటోమోటివ్ చౌస్(రూ.120 కోట్లు) ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి.