News April 12, 2024
తులం బంగారం రూ.73,310, కేజీ వెండి రూ.90,000

బంగారం, వెండి ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఇవాళ మరోసారి రేట్లు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.1,090 పెరిగి రూ.73,310కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.1000 పెరిగి రూ.67,200గా నమోదైంది. వెండి కూడా కేజీకి రూ.1500 పెరిగి రూ.90,000కు చేరింది.
Similar News
News December 1, 2025
‘చిన్నస్వామి’ సేఫ్టీ క్లియరెన్స్ కోరిన ప్రభుత్వం

RCB ర్యాలీలో తొక్కిసలాట నేపథ్యంలో వచ్చే IPLకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచులు జరగడంపై సందిగ్ధత నెలకొంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌కు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది. స్టేడియం సేఫ్టీ రిపోర్ట్ సమర్పించాలని కోరింది. ఆ నివేదిక నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ నుంచి సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్‌తో ప్రిపేర్ చేయించాలని ఆదేశించింది.
News December 1, 2025
అఫ్గాన్‌తో ట్రేడ్ వార్.. నష్టపోతున్న పాక్

అఫ్గాన్‌తో ట్రేడ్ వార్ పాక్‌ను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఆ దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు ఆపేయడంతో పాక్‌లోని సిమెంట్ ఇండస్ట్రీ నష్టపోతోంది. అఫ్గాన్ నుంచి కోల్ దిగుమతి లేకపోవడంతో సౌతాఫ్రికా, ఇండోనేషియా, మొజాంబిక్ నుంచి అధిక ధరలకు సిమెంట్ ఫ్యాక్టరీలు బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాయి. 48 రోజుల నుంచి బార్డర్లు క్లోజ్ కావడంతో మందులు, అగ్రికల్చర్ గూడ్స్‌తోపాటు పండ్లు, కూరగాయల ఎగుమతులు నిలిచిపోయాయి.
News December 1, 2025
పురుషులు, స్త్రీలు ఎంత నీరు తాగాలంటే?

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడా నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. US అకాడమీస్ ఆఫ్ సైన్సెస్ ప్రకారం పురుషులు రోజుకు 3.7లీటర్లు, స్త్రీలు 2.7లీటర్ల మేర నీరు సేవించాలంటున్నారు. వయసు, బరువు, వాతావరణ పరిస్థితులను బట్టి ఇవి మారుతాయని, గర్భిణులు & పాలిచ్చే తల్లులు నీటిని ఎక్కువ సేవించాలని చెబుతున్నారు. తక్కువ నీరు తాగితే ‘హైడ్రేషన్’, ఎక్కువ సేవిస్తే ‘హైపోనాట్రేమియా’ సమస్యలొస్తాయంటున్నారు.


