News April 12, 2024

తులం బంగారం రూ.73,310, కేజీ వెండి రూ.90,000

image

బంగారం, వెండి ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఇవాళ మరోసారి రేట్లు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.1,090 పెరిగి రూ.73,310కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.1000 పెరిగి రూ.67,200గా నమోదైంది. వెండి కూడా కేజీకి రూ.1500 పెరిగి రూ.90,000కు చేరింది.

Similar News

News December 6, 2025

‘పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి’

image

పదో తరగతిలో విద్యార్థులు ఈ సంవత్సరం నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలోని ఎంఈఓలు ఇతర అధికారులతో కలెక్టర్ శనివాకం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు సమాజంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక బాధ్యతను విద్యార్థులకు తెలియజేయాలన్నారు.

News December 6, 2025

గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ

image

AP: విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తోన్న కృషిని CM వివరించినట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని నిర్మాణ పనుల పురోగతిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

News December 6, 2025

హిట్ మ్యాన్@ 20,000 రన్స్

image

SAతో మూడో వన్డేలో రోహిత్ శర్మ కీలక మైలురాయిని చేరుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌(టెస్టు, వన్డే, T20)లో 20,000 పరుగులు చేసిన నాలుగో ఇండియన్ ప్లేయర్‌గా నిలిచారు. కేశవ్ వేసిన 14 ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీసి ఈ ఘనత సాధించారు. సచిన్(34,357), కోహ్లీ(27,910), ద్రవిడ్(24,064) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా ప్రస్తుత మ్యాచ్‌లో భారత్ నిలకడగా ఆడుతోంది. క్రీజులో జైస్వాల్(38), రోహిత్(50) ఉన్నారు.