News February 21, 2025
నవీన్ పొలిశెట్టి- మణిరత్నం కాంబోలో లవ్ స్టోరీ?

టాలీవుడ్ జాతిరత్నం నవీన్ పొలిశెట్టి జాక్‌పాట్ కొట్టినట్లు తెలుస్తోంది. ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మణిరత్నం డైరెక్షన్‌లో నవీన్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. వీరి కాంబోలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సిద్ధంకానుందని సినీవర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కాగా, మణిరత్నం చివరగా ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.
Similar News
News March 24, 2025
దీపక్ చాహర్‌పై ఆసక్తికర పోస్ట్ చేసిన సోదరి

కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచే మీమ్‌ని ముంబై క్రికెటర్ దీపక్ చాహర్ సోదరి మాలతీ చాహర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. నిన్న జరిగిన MI-CSK మ్యాచ్‌లో దీపక్ 25పరుగులతో పాటు ఒక వికెట్ తీసి చెన్నైకు సులువుగా విజయం దక్కకుండా అడ్డుకున్నారు. గత 7 సీజన్లలో CSK జట్టులో ఉన్న దీపక్ ప్రస్తుతం ముంబై తరపున ఆడుతున్నారు. దీంతో ఇన్నాళ్లూ ఆడిన జట్టుకు ద్రోహం చేస్తున్నట్లు అర్థం వచ్చేలా ఆమె ఫన్నీ మీమ్ షేర్ చేశారు.
News March 24, 2025
కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి సవాల్

TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల్లో 5 అమలు చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. తాను చేసిన ఈ సవాల్‌కు కేటీఆర్ సిద్ధమేనా అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లక తప్పదని జోస్యం చెప్పారు.
News March 24, 2025
అభిషేక్ మహంతికి హైకోర్టులో భారీ ఊరట

ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ఆయనను తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులివ్వాలని డీవోపీటీని న్యాయస్థానం ఆదేశించింది. ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ ఇటీవల మహంతికి డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. అయితే స్టే విధించేందుకు క్యాట్ నిరాకరించడంతో మహంతి హైకోర్టు మెట్లెక్కారు.