News December 17, 2024

ఆడ తోడు కోసం 13వేల కి.మీలు ప్రయాణించిన మగ తిమింగలం!

image

మగ తిమింగలం రికార్డు సృష్టించింది. దక్షిణ అమెరికా నుంచి ఆఫ్రికాకు 13,046 కిలోమీటర్లు (8,106 మైళ్లు) పైగా ఈదింది. దీంతో ఇప్పటివరకూ అత్యధిక దూరం ఈదిన తిమింగలంగా రికార్డులకెక్కింది. ఈ విషయాన్ని రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్‌లో ప్రచురించారు. సంతానోత్పత్తి కోసం ఆడ తిమింగలం కోసం వెతుకుతూ ఇంత దూరం ప్రయాణించింది. సహచరుల కోసం పోటీ కారణంగా సాధారణం కంటే డబుల్ డిస్టెన్స్‌ ప్రయాణించాల్సి వస్తోంది.

Similar News

News January 18, 2025

మహాకుంభమేళా: రోజూ లక్ష మంది ఆకలి తీరుస్తున్న ఇస్కాన్

image

మహాకుంభమేళాలో భక్తులు, వర్కర్ల ఆకలి తీర్చేందుకు ఇస్కాన్-అదానీ గ్రూప్ చేతులు కలిపాయి. రోజూ దాదాపు లక్ష మందికి ఆహారాన్ని అందిస్తున్నాయి. ఇందులో దాల్, చోలే/రాజ్మా, వెజిటబుల్ కర్రీ, రోటీ, రైస్‌తోపాటు హల్వా/బూందీ లడ్డూ ఉన్నాయి. పిడకలతో మట్టి పొయ్యిపై ఈ ఫుడ్‌ను వండటం మరో విశేషం. 100 వాహనాల ద్వారా ప్రయాగ్‌రాజ్‌లోని మొత్తం 40 ప్రాంతాల్లో ఆహారాన్ని సరఫరా చేస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధి చెప్పారు.

News January 18, 2025

భారీ ఎదురుదెబ్బ: మావో కీలక నేతతో పాటు 17 మంది మృతి

image

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో ఇటీవల జరిగిన <<15172708>>ఎన్‌కౌంటర్‌లో<<>> మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌తో పాటు 17 మంది మృతి చెందినట్లు ఆ పార్టీ ప్రకటించింది. చొక్కారావు 30 ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. ఇతనిపై రూ.50 లక్షల రివార్డు ఉంది. స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి.

News January 18, 2025

JEE మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల

image

జేఈఈ మెయిన్-2025 సెషన్-1 అడ్మిట్ కార్డులను NTA రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఇక్కడ <>క్లిక్<<>> చేసి తమ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 22, 23, 24న రెండు షిఫ్టుల్లో బీఈ/బీటెక్ పేపర్-1 పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఈనెల 28, 29, 30న జరిగే పేపర్-1, పేపర్-2 పరీక్షల అడ్మిట్ కార్డులు త్వరలో రిలీజ్ కానున్నాయి.