News March 18, 2024
సోదరుడిని పెళ్లాడిన వివాహిత.. ఎందుకంటే?
ఉత్తర్ ప్రదేశ్‌లో విచిత్ర సంఘటన వెలుగు చూసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం సామూహిక వివాహాలు చేసుకునే వారికి రూ.35వేలు అందిస్తోంది. ఇందుకోసం ఓ మహిళ ఏకంగా తన సోదరుడినే దొంగ పెళ్లి చేసుకుంది. పెళ్లి సమయానికి వరుడిని తెచ్చుకోకపోవడంతో మధ్యవర్తులు ఆమె సోదరుడిని రెడీ చేశారు. ఆమె మెడలో తాళి కట్టించారు. ఆమెకు అప్పటికే పెళ్లి కావడం గమనార్హం. ఈ విషయం వెలుగులోకి రావడంతో మహారాజ్‌గంజ్ అధికారులు షాకయ్యారు.
Similar News
News September 18, 2024
మళ్లీ టెన్షన్: అరుణాచల్ సమీపంలో చైనా హెలీపోర్ట్ నిర్మాణం
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఫిష్‌టెయిల్ ప్రాంతానికి సమీపంలో LAC వద్ద 20KM దూరంలో చైనా హెలీపోర్ట్ నిర్మించడం మళ్లీ టెన్షన్ పెంచుతోంది. మెరుగైన సదుపాయాల్లేని ఈ ప్రాంతంలోకి అత్యంత వేగంగా మిలిటరీ సామగ్రిని తరలించేందుకే దీనిని నిర్మించారని సమాచారం. 2023, డిసెంబర్ 1కి ముందు అక్కడేమీ లేదని శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలిసింది. చైనా నియంత్రణలోని టిబెట్‌లో దీనిని నిర్మించడంతో భారత్ అభ్యంతరం చెప్పలేకపోతోంది.
News September 18, 2024
రాజకీయ పార్టీల ఫ్రీబీస్‌పై విచారిస్తాం: సుప్రీం కోర్టు
ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీల ఉచిత హామీలపై విచారణ అత్యంత ముఖ్యమని సుప్రీంకోర్టు తెలిపింది. అవతలిపక్షం వాదనలు వినాల్సి ఉండటంతో పిల్‌ను నేడు విచారించడం కుదరదంది. కాజ్‌లిస్టు నుంచి డిలీట్ చేయబోమని CJI చంద్రచూడ్, జస్టిస్‌లు పార్థివాల, మనోజ్ మిశ్రా బెంచ్ పేర్కొంది. ఫ్రీబీస్ హామీలిచ్చే పార్టీల గుర్తుల్ని నిలిపేయాలని, వాటి గుర్తింపు రద్దు చేసేలా ఈసీకి ఆదేశాలివ్వాలంటూ మార్చి 20న ఓ లాయర్ ఈ పిల్ వేశారు.
News September 18, 2024
గ్రామీణ యువకుడికి రూ.2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం!
బిహార్ అనగానే వలసలు, గొడవలే గుర్తొస్తాయి. కానీ, తమలోనూ ఎంతో ప్రతిభ ఉందని జము ఖరియాకు చెందిన కంప్యూటర్ ఇంజినీర్ అభిషేక్ కుమార్ నిరూపించారు. గ్రామీణప్రాంతానికి చెందిన అతను లండన్‌లోని గూగుల్ కంపెనీలో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని పొంది ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. NIT పట్నాలో ఇంజినీరింగ్ పూర్తి చేసి 2022లో Amazonలో ₹1.08 కోట్ల వేతనంతో ఉద్యోగం పొందారు. తాజాగా గూగుల్‌లో జాబ్ సాధించారు.