News March 21, 2024
ఏప్రిల్ 8న ఆకాశంలో అద్భుతం
ఏప్రిల్ 8న సంభవించే సంపూర్ణ సూర్య గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. 50 ఏళ్లలో ఇదే అత్యంత సుదీర్ఘ గ్రహణం. ఆ రోజున రా.9.12 నుంచి అర్ధరాత్రి 1.25 వరకు కొనసాగనుంది. మన దేశంలో ఎక్కువగా కనిపించదని సైంటిస్టులు చెబుతున్నారు. కెనడా, మెక్సికో, ఉత్తర అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో కనువిందు చేయనుంది. భూమి, సూర్యునికి మధ్య చంద్రుడు వస్తే సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది.
Similar News
News September 19, 2024
నేడు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం
AP: రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో 75 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది. ఇందులో విశాఖ పరిధిలోనే 25 క్యాంటీన్లు ఉన్నాయి. మొత్తంగా 203 కేంద్రాలను మొదలుపెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా తొలి విడతలో 100 క్యాంటీన్లను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ రూ.5కే ఉదయం ఇడ్లీ/పూరి/ఉప్మా/పొంగల్, చట్నీ, సాంబార్, లంచ్- డిన్నర్‌లో అన్నం, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి అందిస్తారు.
News September 19, 2024
INDvsBAN: నేటి నుంచే తొలి టెస్టు
చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు నేడు ప్రారంభం కానుంది. సొంత గడ్డపై 2012 నుంచి టెస్టు సిరీస్ ఓడని IND తన ఖాతాలో మరో సిరీస్‌ను వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. పాక్‌ను వైట్‌వాష్ చేసిన ఊపులో ఉన్న బంగ్లా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలనుకుంటోంది. ఉ.9.30 నుంచి స్పోర్ట్స్18లో వీక్షించవచ్చు.
IND అంచనా టీమ్: రోహిత్, జైస్వాల్, గిల్, కోహ్లీ, రాహుల్, పంత్, జడేజా, అశ్విన్, కుల్దీప్, సిరాజ్, బుమ్రా
News September 19, 2024
బాలికలపై లైంగిక వేధింపులు.. వార్డెన్ సస్పెండ్
AP: ఏలూరులోని ఓ ఆశ్రమ హాస్టల్‌లో బాలికలపై లైంగిక వేధింపులకు <<14129113>>పాల్పడిన<<>> గ్రేడ్-2 సంక్షేమాధికారి శశికుమార్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. విద్యార్థినుల ఫిర్యాదుతో ప్రాథమిక దర్యాప్తు చేయించిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. పూర్తి విచారణ అనంతరం శశికుమార్, అతడికి సహకరించిన వారిపై పోక్సో కేసు నమోదుచేస్తామని చెప్పారు.