News January 30, 2025
కేంద్ర మంత్రులకు తప్పిన ప్రమాదం

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మలకు ప్రమాదం తప్పింది. కాన్వాయ్లోని 3 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా అంతకుముందు వైజాగ్ ఎయిర్పోర్టులో కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం లభించింది. కాసేపట్లో కార్మికులతో ముఖాముఖీ నిర్వహించి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.
Similar News
News January 23, 2026
వసంత పంచమి వేడుకలు ఎలా చేసుకోవాలంటే..

వసంత పంచమి వేడుకల్లో పసుపు రంగుకు ప్రాధాన్యం ఎక్కువ. ప్రజలు తెల్లవారునే లేచి, పసుపు రంగు దుస్తులు ధరించి సరస్వతీ పూజ చేస్తారు. పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పెట్టి పంచుకుంటారు. కొందరు శివపార్వతులను పూజిస్తారు. మరికొందరు సూర్య నమస్కారాలు చేస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విందులు ఆరగిస్తూ, పాటలతో, నృత్యాలతో ఈ వసంత ఆగమనాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
News January 23, 2026
వసంత పంచమి పూజా విధానం

పూజా మందిరాన్ని శుభ్రపరిచి పీటపై తెల్లని వస్త్రాన్ని పరవాలి. దానిపై సరస్వతీ దేవి చిత్రపటాన్ని ఉంచి గంధం, కుంకుమతో అలంకరించాలి. 9 వత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించడం శుభప్రదం. మల్లెలు, జాజి పూలతో అర్చన చేస్తూ సరస్వతి అష్టోత్తర శతనామాలు పఠించాలి. పాలు, పటిక బెల్లం, పాయసాన్ని నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి. పూజానంతరం ప్రసాదాన్ని పిల్లలకు పంచడం ద్వారా విద్యా బుద్ధులు కలుగుతాయని పెద్దలు చెబుతారు.
News January 23, 2026
కరాచీ ప్రమాదంలో 67కు చేరిన మృతుల సంఖ్య

పాకిస్థాన్ కరాచీలోని ‘గుల్ షాపింగ్ ప్లాజా’లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 67కు చేరింది. శిథిలాల నుంచి పదుల సంఖ్యలో మృతదేహాలను వెలికితీశారు. దుబాయ్ క్రాకరీ అనే షాప్లో ఒకేచోట 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. మంటల నుంచి తప్పించుకోవడానికి షాప్ లోపల దాక్కోగా.. ఊపిరి ఆడక చనిపోయారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మృతుల్లో 12 మందిని మాత్రమే గుర్తించారు.


