News August 14, 2024

కదిలిస్తున్న కార్టూన్ ‘ప్రిస్క్రిప్షన్’

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన యావత్ సమాజం తలదించుకునేలా చేసింది. అయితే దానిపై సాజిత్ కుమార్ అనే కార్టూనిస్ట్ గీసిన కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో పేషెంట్ పేరు ఇండియన్ మేల్ అని రాసి ఉంది. ప్రిస్క్రిప్షన్‌లో ‘వాళ్లను బుద్ధిగా పెంచండి’ అని డాక్టర్ సూచించినట్లు ఉంది. కాగా డాక్టర్ సంతకం పెట్టాల్సిన ప్రదేశంలో రక్తపు మరకలు ఉండటం మనసులను కదిలిస్తోంది. దీనిపై మీ కామెంట్?

Similar News

News September 13, 2024

UNలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతిస్తాం: అమెరికా

image

UN భద్రతా మండలిలో భారత్, జర్మనీ, జపాన్ శాశ్వత సభ్యత్వాలకు తాము మద్దతిస్తామని అమెరికా పునరుద్ఘాటించింది. ఆఫ్రికా దేశాలకు తాత్కాలిక సభ్యత్వాలతో పాటు 2 శాశ్వత సభ్యత్వాల సృష్టికి తమ మద్దతు కొనసాగుతుందని UNలో US అంబాసిడర్ లిండా థామస్ పేర్కొన్నారు. ‘ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం భారత్. మండలిలో నిజంగానే వారికి మేం మద్దతిస్తాం. వారి శాశ్వత సభ్యత్వాన్ని తిరస్కరించే పరిస్థితులే లేవు’ అని అన్నారు.

News September 13, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

image

AP: తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇటు టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,544 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,942 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.3.37 కోట్ల ఆదాయం లభించింది.

News September 13, 2024

‘దేవర’కు అరుదైన ఘనత

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమాకు అరుదైన ఘనత లభించింది. లాస్ ఏంజెల్స్‌లోని బియాండ్ ఫెస్ట్‌లో ఈ మూవీ ప్రదర్శించనున్నారు. ఈనెల 26న సాయంత్రం 6.30 గంటలకు ప్రఖ్యాత ఈజిప్షియన్ థియేటర్‌లో షో వేయనున్నారు. ఈ విషయాన్ని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రీమియర్‌ రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ పాల్గొననున్నట్లు తెలిపాయి. హాలీవుడ్ సెలబ్రిటీలూ ‘దేవర’ చూడనున్నట్లు సమాచారం.