News April 2, 2025

కొత్త ఛేజ్ మాస్టర్ వచ్చేశాడు!

image

PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్య ఛేదనలో సెన్సేషనల్ రికార్డు సొంతం చేసుకున్నారు. నిన్న LSG మ్యాచ్‌(52*)తో కలిపి 2023 నుంచి IPLలో 6సార్లు ఛేజింగ్‌ చేస్తూ నాటౌట్‌గా నిలిచారు. గతేడాది KKRకు కప్ అందించిన అయ్యర్‌కు వేలంలో రూ.26.75cr దక్కాయి. ఈ క్రమంలో అతనిపై భారీగా అంచనాలు పెరగ్గా.. అందుకు తగ్గట్లుగానే ఓ వైపు కెప్టెన్సీ చేస్తూ, మరోవైపు కోహ్లీ వారసత్వాన్ని తీసుకొని కొత్త ఛేజ్ మాస్టర్ అవతారమెత్తారు.

Similar News

News April 3, 2025

‘అమరావతి’కి తొలి విడత రుణం.. ఖాతాలో రూ.3,535 కోట్లు జమ

image

AP: రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు తొలి విడతలో రూ.3,535 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ నిధులు ఇవాళ ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. త్వరలోనే ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు(ADB) నుంచీ తొలి విడత రుణం మంజూరవుతుందని ప్రభుత్వ పెద్దలు తెలిపారు. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు, ADB రూ.6,700 కోట్లు చొప్పున రుణం ఇస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా రూ.1,400 కోట్లు ప్రత్యేక సాయంగా అందిస్తోంది.

News April 3, 2025

నేడు రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లు

image

వక్ఫ్ సవరణ బిల్లు 12 గంటల సుదీర్ఘ చర్చల అనంతరం లోక్‌సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. నేడు చర్చ, ఆమోదం కోసం బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ ఎన్డీఏకు 125 మంది సభ్యుల బలం ఉండడంతో పాస్ అవ్వడం లాంఛనమే. ముస్లిం సంఘాలు, విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా కేంద్రం వెనక్కి తగ్గలేదు. ట్రిపుల్ తలాఖ్‌ రద్దు, సిటిజన్‌షిప్ యాక్ట్, యూనిఫామ్ సివిల్ కోడ్ విషయాల్లోనూ విమర్శలు వచ్చినా ముందుకు సాగింది.

News April 3, 2025

ట్రంప్ టారిఫ్స్: అత్యధికంగా ఈ దేశాలపైనే

image

* సెయింట్ పిర్రే అండ్ మిక్‌లెన్- 50%
* లెసోతో-50%
* కాంబోడియా- 49%
* లావోస్-48% *మడగాస్కర్-47%
* వియత్నాం-46%
* శ్రీలంక-44% *మయన్మార్-44%
* సిరియా- 41% * ఇరాక్-39%
*బంగ్లాదేశ్-37% * చైనా-34% *పాకిస్థాన్-29%
>>ఇండియాపై 26%

error: Content is protected !!