News April 2, 2025

కొత్త ఛేజ్ మాస్టర్ వచ్చేశాడు!

image

PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్య ఛేదనలో సెన్సేషనల్ రికార్డు సొంతం చేసుకున్నారు. నిన్న LSG మ్యాచ్‌(52*)తో కలిపి 2023 నుంచి IPLలో 6సార్లు ఛేజింగ్‌ చేస్తూ నాటౌట్‌గా నిలిచారు. గతేడాది KKRకు కప్ అందించిన అయ్యర్‌కు వేలంలో రూ.26.75cr దక్కాయి. ఈ క్రమంలో అతనిపై భారీగా అంచనాలు పెరగ్గా.. అందుకు తగ్గట్లుగానే ఓ వైపు కెప్టెన్సీ చేస్తూ, మరోవైపు కోహ్లీ వారసత్వాన్ని తీసుకొని కొత్త ఛేజ్ మాస్టర్ అవతారమెత్తారు.

Similar News

News April 17, 2025

ఈసారి ఐపీఎల్ టైటిల్ RCBదే: విలియమ్సన్

image

ఐపీఎల్-2025 విజేత ఎవరనేది న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ప్రిడిక్ట్ చేశారు. ఆర్సీబీ జట్టు ఈసారి కచ్చితంగా కప్ గెలుస్తుందన్నారు. ‘విరాట్ కోహ్లీ ప్రతి సీజన్‌లో అద్భుతంగా ఆడారు. ఈ ఏడాది కూడా అదే ఇంపాక్ట్ చూపిస్తున్నారు. గేమ్ పట్ల హంగర్, ప్యాషన్‌ ఏమాత్రం తగ్గలేదు. ఆర్సీబీకి కప్ అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఏడాది ఆ కల నెరవేరుతుంది’ అని వ్యాఖ్యానించారు. మరి మీరేమంటారు? COMMENT

News April 17, 2025

ఎల్లుండి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

image

AP: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు జులై నెల కోటా APR 19న ఉ.10 గం.కు విడుదల కానుంది. లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఎల్లుండి నుంచి 21వ తేదీ ఉ.10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకరణ సేవా టికెట్లు 22న ఉ.10 గంటలకు రిలీజ్ కానున్నాయి. జులై కోటా రూ.300 ప్రత్యేక ప్రవేశం దర్శనం టికెట్లు 24న ఉ.10 గంటలకు, మ.3 గంటలకు గదుల కోటా రిలీజ్ కానుంది.

News April 17, 2025

IPL: వారి సరసన రోహిత్ శర్మ

image

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్‌లో ఒకే వేదికలో 100కు పైగా సిక్సర్లు బాదిన నాలుగో ఆటగాడిగా నిలిచారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా కోహ్లీ(130), గేల్(127), డివిలియర్స్(118) వందకు పైగా సిక్సర్లు బాదారు. వాంఖడేలో రోహిత్ 102 సిక్సర్లు కొట్టగా ఆ తర్వాతి స్థానంలో పొలార్డ్(85) ఉన్నారు.

error: Content is protected !!