News August 9, 2024
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారులకు కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఒక పోస్టులో ఫొటోలు, వీడియోల పరిమితిని పెంచింది. ఈ కొత్త ఫీచర్‌తో ఒకే పోస్టులో 20 ఫొటోలు, వీడియోలు పంచుకోవచ్చు. గతంలో ఒక పోస్టులో 10 ఫొటోలు, వీడియోలు మాత్రమే పంచుకునే అవకాశం ఉండేది. ఇది ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం మీ ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
Similar News
News September 14, 2024
1, 2 అంతస్తుల్లో ఉన్నవారికీ వరద సాయం
AP: రాష్ట్రంలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17న వరద ముంపు బాధితులకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నవారికి కూడా సాయం అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆపైన ఉన్న అంతస్తుల వారికీ కొంత సాయం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అన్నిటినీ పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లించనున్నారు.
News September 14, 2024
పటిష్ఠంగానే ‘రాజధాని’ పునాదులు?
AP: ఐదేళ్లుగా నీటిలో నానుతున్న రాజధాని అమరావతిలోని భవనాల పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయని చెన్నై, HYD IIT నిపుణులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు సమాచారం. తుప్పు పట్టిన ఇనుము తొలగించి, కెమికల్ ట్రీట్‌మెంట్ చేసి నిర్మాణాలు కొనసాగించవచ్చనే నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా నిపుణులు ఇటీవల రాజధాని నిర్మాణాలను పరిశీలించిన విషయం తెలిసిందే.
News September 14, 2024
రోహిత్ నాకు అన్నయ్యలాంటివాడు: సర్ఫరాజ్
బాలీవుడ్ సినిమా లగాన్‌లో ఆమిర్ ఖాన్ పాత్ర తరహాలో రోహిత్ శర్మ నిజజీవితంలో ఉంటారని క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్నారు. జట్టులో అందర్నీ గౌరవంతో చూస్తారని పేర్కొన్నారు. ‘రోహిత్ చాలా విభిన్నమైన వ్యక్తి. మేం చాలా సౌకర్యంగా ఉండేలా చూసుకుంటారు. ఒకరకంగా చెప్పాలంటే నాకు అన్నయ్యలాంటి మనిషి. కొత్త కుర్రాళ్లను కూడా తనతో సమానంగానే ట్రీట్ చేస్తారు. ఆయన కెప్టెన్సీలో ఆడటాన్ని మేం ఎంజాయ్ చేస్తున్నాం’ అని తెలిపారు.