News March 2, 2025
ఓటీటీలో అదరగొడుతున్న కొత్త సినిమా

థియేటర్లలో అదరగొట్టిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ జీ5 ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. 12 గంటల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ నమోదయ్యాయని సంస్థ వెల్లడించింది. దాదాపు 13 లక్షల మంది సినిమాను వీక్షించారంది. ఇది జీ5లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని తెలిపింది. ఈ క్రమంలో RRR, హనుమాన్ రికార్డులన్నీ బ్రేకయినట్లు మూవీ వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News March 25, 2025
BSNL యూజర్లకు అలర్ట్

కేవైసీ కంప్లీట్ చేయకపోతే 24 గంటల్లో సిమ్ బ్లాక్ అవుతుందని నోటీసులు వస్తే స్పందించవద్దని యూజర్లకు BSNL సూచించింది. ఇటీవల పలువురు యూజర్లకు ఇలాంటి నోటీసులు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, కానీ తాము ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. స్కామర్లు KYC పేరిట యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలిపింది. వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News March 25, 2025
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అవసరం లేదనిపించింది: ధోనీ

IPLలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రూల్‌ను ప్రకటించినప్పుడు అవసరం లేదని అనిపించింది. టోర్నీ మంచి పొజిషన్‌లోనే ఉంది. TRP కూడా బాగుంది. అలాంటప్పుడు ఇంకా మసాలా యాడ్ చేయడమెందుకు అని అనుకున్నా. ప్రస్తుతం ఈ రూల్ నాకు హెల్ప్ అవ్వదు. ఎందుకంటే నేను బ్యాటింగ్, కీపింగ్ రెండూ చేస్తున్నా. టోర్నీలో హైస్కోర్లు నమోదవడానికి పిచ్ పరిస్థితులే కారణం. ఈ రూల్ కాదు’ అని పేర్కొన్నారు.
News March 25, 2025
నేను క్షమాపణ చెప్పను: కునాల్ కమ్రా

మహారాష్ట్ర Dy.CM ఏక్‌నాథ్ షిండేపై తాను చేసిన వ్యాఖ్యలను కమెడియన్ <<15868229>>కునాల్ కమ్రా<<>> సమర్థించుకున్నారు. క్షమాపణలు చెప్పబోనని ఓ ప్రకటన విడుదల చేశారు. ‘భావ వ్యక్తీకరణ హక్కు అనేది శక్తివంతమైన వారిని ప్రశంసించడానికి మాత్రమే కాదు. రాజకీయ నేతలపై వ్యంగ్యంగా మాట్లాడడం చట్టవిరుద్ధం కాదు. షిండే గురించి అజిత్ పవార్ ఏం అన్నారో అదే నేనూ చెప్పాను. అయినా పోలీసులు, కోర్టుకు సహకరిస్తాను’ అని పేర్కొన్నారు.