News May 10, 2024
జపాన్‌లో కొత్త ట్రెండ్.. ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్

బాధ్యతతో కూడిన వివాహ బంధాలకు జపాన్ యువత మొగ్గు చూపడం లేదు. ప్రేమ, లైంగిక సంబంధాలకు తావు లేకుండా ‘ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. పరస్పర ఇష్టాలు, విలువల ఆధారంగా వారు జీవిస్తారు. కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలను కంటారు. దేశంలో 500 మంది ఇలాంటి బంధంతో ఒక్కటయ్యారని కొలొరస్ అనే జపాన్ సంస్థ వెల్లడించింది. ఆర్థిక, ఉద్యోగపరమైన సవాళ్ల నేపథ్యంలో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారట.
Similar News
News February 8, 2025
ఆధిక్యంలోకి వచ్చిన కేజ్రీవాల్, సిసోడియా

న్యూఢిల్లీ స్థానంలో ఆప్ అధినేత కేజ్రీవాల్(254+), జంగ్‌పురాలో మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా(1800+) తొలిసారి ఆధిక్యంలోకి వచ్చారు. కౌంటింగ్ మొదలైన దాదాపు రెండు గంటల తర్వాత ఆప్ అగ్రనేతలు లీడింగ్‌లోకి వచ్చారు. మరోవైపు కల్కాజీ స్థానంలో సీఎం ఆతిశీ, షాకూర్ బస్తీలో సత్యేంద్ర జైన్ వెనుకంజలో కొనసాగుతున్నారు.
News February 8, 2025
రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా కథ ఇదేనా?

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోడి రామ్మూర్తి జీవిత కథ ఆధారంగా తీస్తున్నారని తొలుత ప్రచారం నడిచింది. అయితే సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా కథ గురించి హింట్ ఇచ్చారు. ‘రాత్రుళ్లు షూటింగ్, ఫ్లడ్ లైట్లు, పవర్ క్రికెట్, విచిత్రమైన కోణాలు’ అని ట్వీట్ చేశారు. దీంతో రెండు ఊళ్ల మధ్య జరిగే క్రికెట్ ఆధారంగా మూవీ కథ ఉంటుందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
News February 8, 2025
అనూహ్యం.. ముస్లింల ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం

ఢిల్లీలోని ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తొలుత ఆప్ ఆధిక్యం కనబరిచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయా స్థానాల్లో బీజేపీ దూసుకొచ్చింది. మొత్తం 12 స్థానాల్లో ప్రస్తుతం 7 చోట్ల బీజేపీ లీడింగ్‌లో ఉంది. దీంతో ఆప్, కాంగ్రెస్‌ని కూడా ముస్లింలు ఆదరించలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.