News March 25, 2024
‘శివ శక్తి’ పేరుకు ఆమోదం

జాబిల్లిపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి ప్రధాని మోదీ ప్రకటించిన ‘శివ శక్తి’ పేరును అంతర్జాతీయ ఖగోళ సంఘం ఆమోదించింది. గతేడాది ఆగస్టు 23న ప్రధాని ఆ పేరును ప్రకటించగా దాదాపు 7 నెలల తర్వాత ఆమోదం లభించింది. ప్రకృతి పురుషుడు (శివుడు), స్త్రీ (శక్తి) అర్థాలను వర్ణించే భారతీయ పురాణాల నుంచి సేకరించిన పదమే ‘శివ శక్తి’ అని గెజిటరీ ఆఫ్ ప్లానెటరీ నోమెన్‌క్లేచర్ వివరించింది.
Similar News
News January 21, 2026
గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు: వరంగల్ కలెక్టర్

జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పని చేసి యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో పాటు, మత్తు పదార్థాలకు అలవాటు పడితే కలిగే నష్టాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
News January 21, 2026
అవసరమైతే హరీశ్ రావును మళ్లీ విచారిస్తాం: సజ్జనార్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో అవసరమైతే హరీశ్ రావును మళ్లీ విచారణకు పిలుస్తామని HYD CP, సిట్ చీఫ్ సజ్జనార్ తెలిపారు. ‘ఈ కేసులో హరీశ్‌ను ఇవాళ విచారించాం. ఆయనకు సుప్రీంకోర్టులో స్టే రాలేదు. తన కుమారుడు అమెరికా వెళ్తున్న కారణంగా ముందుగా బయల్దేరి వెళ్లేందుకు ఆయనకు అనుమతి ఇచ్చాం. కేసులో సాక్షులను ప్రభావితం చేయొద్దని సూచించాం’ అని చెప్పారు. ఇవాళ 7గంటలకు పైగా హరీశ్ రావును సిట్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.
News January 20, 2026
గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌తో AP CM చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, జాప్యం లేకుండా సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని CBN కోరారు. IBM ఛైర్మన్ అరవింద్ కృష్ణతోనూ CM సమావేశం అయ్యారు. అమరావతిలో నిర్మించే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌పై చర్చించారు.


