News March 21, 2025
కాళ్లు చచ్చుబడిన వ్యక్తికి AI సాయంతో తిరిగి నడక!

వెన్నెముక గాయంతో రెండేళ్లపాటు మంచం పట్టిన వ్యక్తిని చైనాలోని హువాషాన్ ఆస్పత్రి పరిశోధకులు తిరిగి నడిచేలా చేయగలిగారు. దీనికోసం వారు ఏఐని వాడుకోవడం విశేషం. ఏఐ సాయంతో తాము అభివృద్ధి చేసిన ‘ట్రిపుల్ ఇంటిగ్రేటెడ్ బ్రెయిన్ స్పైన్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ’ని వాడి మెదడుకు, వెన్నెముకకు మధ్య ఎలక్ట్రోడ్లను అమర్చి నరాల బైపాస్ సర్జరీ నిర్వహించామన్నారు. 24 గంటలకే అతడికి కాళ్లు నియంత్రణలోకి వచ్చాయని వివరించారు.
Similar News
News September 18, 2025
HEALTH: ఇవి పాటిస్తే రోగాలు దూరం!

* ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం పుష్కలంగా నీరు తాగండి
* గుండె ఆరోగ్యం కోసం అధికంగా ఉప్పు తినకూడదు
* పొగ తాగకుండా ఉంటే మీ ఊపిరితిత్తులు సేఫ్
* రోజూ 8 గంటలు నిద్రపోతే మెదడు ఆరోగ్యంగా ఉండి చురుగ్గా పనిచేస్తుంది
* పొట్ట ఆరోగ్యం కోసం ఐస్క్రీమ్స్, చల్లని పదార్థాలు తినడం మానేయాలి
* మూత్రనాళం ఆరోగ్యానికి పచ్చి ఉల్లిపాయలు మంచివని వైద్యులు చెబుతున్నారు.
News September 18, 2025
27 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

ఐఐటీ ఢిల్లీలో 4 ప్రాజెక్ట్ సైంటిస్టు పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఈ నెల 30 ఆఖరు తేదీ. ఐఐటీ హైదరాబాద్లో 4 రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు ఈనెల 26 వరకు, మునిషన్స్ ఇండియా లిమిటెడ్లో 14 ఇంజినీర్ పోస్టులకు ఈ నెల 28వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్లో 5 ఉద్యోగాలకు అక్టోబర్ 3 వరకు అవకాశం ఉంది.
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.