News August 29, 2024

21 ఏళ్లకే భారత సంపన్నుల జాబితాలో చోటు!

image

భారతీయ సంపన్నుల జాబితాలో Zepto సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు. ఆయన వయసు 21 ఏళ్లు కాగా ఇప్పటికే నికర విలువ రూ.3600 కోట్లకు చేరింది. కాగా, అదే కంపెనీకి చెందిన 22 ఏళ్ల ఆదిత్ పాలిచా ఈ జాబితాలో రెండో పిన్న వయస్కుడిగా ఉన్నారు. కరోనా సమయంలో కాంటాక్ట్‌లెస్ డెలివరీకి డిమాండ్ పెరగడంతో ఈ ఇద్దరు స్నేహితులు 2021లో Zeptoని ప్రారంభించారు.

Similar News

News November 20, 2025

నవంబర్ 20: చరిత్రలో ఈ రోజు

image

1750: మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం
1910: ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ మరణం
1956: తెలుగు సినీ దర్శకుడు వంశీ జననం
1973: నటి శిల్పా శిరోద్కర్ జననం
1981: భాస్కర-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో (ఫొటోలో)
1994: నటి ప్రియాంక మోహన్ జననం
* ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం

News November 20, 2025

నవంబర్ 20: చరిత్రలో ఈ రోజు

image

1750: మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం
1910: ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ మరణం
1956: తెలుగు సినీ దర్శకుడు వంశీ జననం
1973: నటి శిల్పా శిరోద్కర్ జననం
1981: భాస్కర-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో (ఫొటోలో)
1994: నటి ప్రియాంక మోహన్ జననం
* ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం

News November 20, 2025

తెలుగు ప్రాక్టీస్ చేస్తున్నా: ప్రియాంకా చోప్రా

image

‘వారణాసి’ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు తెలుగు నేర్చుకుంటున్నట్లు హీరోయిన్ ప్రియాంకా చోప్రా తెలిపారు. ఇన్‌‌స్టాలో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. తాను కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్పారు. తెలుగు తన మాతృభాష కాదని, ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి సాయం చేస్తున్నారని ఇటీవల అన్నారు. రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి 2027 సమ్మర్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.