News August 29, 2024
21 ఏళ్లకే భారత సంపన్నుల జాబితాలో చోటు!

భారతీయ సంపన్నుల జాబితాలో Zepto సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు. ఆయన వయసు 21 ఏళ్లు కాగా ఇప్పటికే నికర విలువ రూ.3600 కోట్లకు చేరింది. కాగా, అదే కంపెనీకి చెందిన 22 ఏళ్ల ఆదిత్ పాలిచా ఈ జాబితాలో రెండో పిన్న వయస్కుడిగా ఉన్నారు. కరోనా సమయంలో కాంటాక్ట్‌లెస్ డెలివరీకి డిమాండ్ పెరగడంతో ఈ ఇద్దరు స్నేహితులు 2021లో Zeptoని ప్రారంభించారు.
Similar News
News February 13, 2025
స్థానిక సంస్థల్లో నోటా.. పార్టీలు ఏమన్నాయంటే?

TG: ఏకగ్రీవం లేకుండా <<15405631>>ఎన్నికల నిర్వహణపై<<>> ఈసీతో భేటీలో ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నిక నిర్వహించొద్దని కాంగ్రెస్, సీపీఎం సూచించాయి. రీ ఎలక్షన్ నిర్వహించాలని BRS, సీపీఐ, జనసేన, ఆప్ పేర్కొన్నాయి. మరోవైపు సుప్రీం కోర్టు తీర్పు వచ్చాకే దీనిపై స్పందిస్తామని బీజేపీ తెలిపింది. దీంతో ఎన్నికల నియమావళిలో మార్పుపై త్వరలోనే ఈసీ నిర్ణయం తీసుకోనుంది.
News February 13, 2025
కాసేపట్లో మోదీ, ట్రంప్ కీలక భేటీ

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కాసేపట్లో అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు. వలస విధానం, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ల తరలింపు, ట్రేడ్, టారిఫ్స్, విదేశాంగ విధానాలపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే భారత్ ఖరీదైన బైకులపై టారిఫ్స్ తగ్గించింది. ఈ పర్యటన తర్వాత మరిన్ని దిగుమతులపై టారిఫ్ తగ్గించే అవకాశం ఉంది.
News February 13, 2025
ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక

TG: ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ రాకముందే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టొద్దని ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డు సూచించింది. ఒకవేళ చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే అడ్మిషన్లు చేపట్టినట్లు కొన్ని కాలేజీలపై ఫిర్యాదు వచ్చాయని అధికారులు తెలిపారు. గుర్తింపు లేని కాలేజీల్లో చేరొద్దని విద్యార్థులకు సూచించారు. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను https://tgbie.cgg.gov.in/ <