News September 24, 2024
నేడు భూమిని సమీపిస్తున్న విమానం సైజు గ్రహశకలం
పల్లీ ఆకారంలోని 2 గ్రహశకలాలు మంగళవారం రాత్రి భూమికి అత్యంత సమీపం నుంచి వెళ్తాయని నాసా జెట్ ప్రొపల్షన్ లెబోరేటరీ తెలిపింది. అందులో ఒకటి విమానం (120 ఫీట్) సైజులో ఉంటుంది. 2024 RO11గా పిలిచే ఇది భూమికి 45.8 లక్షల మైళ్ల దూరం నుంచి వెళ్తుంది. బస్సు (26 ఫీట్) సైజులో ఉండే 2020 GE శకలం మన గ్రహానికి కేవలం 4.10 లక్షల మైళ్ల దూరం నుంచే వెళ్తుండటం గమనార్హం. ప్రత్యేకమైన టెలిస్కోపులతో వీటిని చూడొచ్చు.
Similar News
News October 13, 2024
మీ పిల్లలకు ఇవి నేర్పుతున్నారా?
వయసు పెరిగే పిల్లలకు తల్లిదండ్రులు కొన్ని స్కిల్స్ నేర్పించాలి. క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, సాయం చేయడం వంటివి నేర్పాలి. చెట్లు నాటడం, సంరక్షణ, తోటి పిల్లలతో ఎలా మెలగాలో చెప్పాలి. డబ్బు విలువ తెలియజేయాలి, వస్తువులపై ధరలు, క్వాలిటీ వంటివి చూపించాలి. మార్కెట్‌లో బేరాలు ఆడటం నేర్పించాలి. ఎమోషనల్ బ్యాలెన్స్‌పై అవగాహన కల్పించాలి. పెద్దలను గౌరవించేలా తీర్చిదిద్దాలి.
News October 13, 2024
‘దసరా’ దర్శకుడితో నాని మరో మూవీ
‘దసరా’ మూవీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో హీరో నాని ఓ సినిమా చేయబోతున్నారు. దసరా సందర్భంగా ముహూర్త షాట్‌కు హీరో నాని క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
News October 13, 2024
సంజూ శాంసన్ సెల్ఫ్‌లెస్ ప్లేయర్: సూర్య
వికెట్ కీపర్ సంజూ శాంసన్ సెల్ఫ్ లెస్ క్రీడాకారుడు అని టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించారు. సెంచరీ ముందు కూడా బౌండరీ బాదడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ‘నాకు నిస్వార్ధపరులైన ఆటగాళ్లతో కూడిన జట్టు అంటే ఇష్టం. ఎవరైనా 49 లేదా 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు సింగిల్ కోసం ప్రయత్నించి జట్టు ప్రయోజనాలు దెబ్బ తీయొద్దు. పరుగులు సాధించే క్రమంలో రికార్డులు వాటంతటవే రావాలి’ అని ఆయన పేర్కొన్నారు.