News August 1, 2024

డెంగ్యూతో నిండు గర్భిణి మృతి.. కడుపులోని కవలలు కూడా..

image

TG: నెలలు నిండిన ఆ గర్భిణి మరికొద్ది రోజుల్లో తనలోని ప్రాణాలు బయటి ప్రపంచంలోకి వస్తాయని ఆనందపడింది. అమ్మనయ్యే మధురానుభూతి పొందేందుకు ఆరాటపడింది. కానీ అంతలోనే డెంగ్యూ ఆ తల్లీబిడ్డలను కబళించింది. హనుమకొండ(D)లో ఈ విషాదం జరిగింది. గట్లకానిపర్తికి చెందిన శిరీష డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించింది. ఆమె కడుపులో ఉన్న కవలలను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం వృథా అయింది.

Similar News

News October 12, 2024

తప్పు ఎక్కడ జరిగింది?

image

తమిళనాడు కవరైపెట్టైలో ఆగి ఉన్న గూడ్స్ రైలును భాగమతి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిన ఘటనలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. రైలు మెయిన్ లైన్‌లో వెళ్లేలా సిగ్నల్ ఇవ్వగా, ట్రాక్ మాత్రం రైలును క్లోజ్డ్ లూప్ వైపు మళ్లించినట్లు దక్షిణ రైల్వే జీఎం ఆర్ఎన్ సింగ్ వెల్లడించారు. మెయిన్ లైన్‌పై వెళ్లాల్సిన రైలు ఎక్కడో తప్పు జరిగిన కారణంగా గూడ్స్ ఉన్న లైన్‌లోకి వెళ్లిందన్నారు. త్వరలోనే ఏం జరిగిందనేది ప్రకటిస్తామన్నారు.

News October 12, 2024

17న కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం

image

హ‌రియాణాలో BJP ప్ర‌భుత్వం Oct 17న కొలువుదీర‌నుంది. పంచ‌కుల‌లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో నాయబ్ సింగ్ సైనీ మ‌రోసారి CMగా ప్ర‌మాణస్వీకారం చేయ‌నున్నారు. ఆయ‌న‌తోపాటు నూత‌న మంత్రివ‌ర్గ స‌భ్యులు కూడా ప్ర‌మాణం చేయనున్నారు. ప్ర‌ధాని మోదీ, BJP పాలిత రాష్ట్రాల CMలు కార్య‌క్ర‌మంలో పాల్గొంటార‌ని తెలుస్తోంది. కొత్త స‌భ్యుల‌కు ఈసారి మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యం ద‌క్క‌నున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

News October 12, 2024

జామ్‌నగర్ సింహాసనానికి వారసుడిగా జడేజా

image

గుజరాత్‌లోని జామ్‌నగర్‌ సంస్థాన మహారాజు శత్రుశల్య సిన్హ్‌జీ దిగ్విజయ్ సిన్హ్‌జీ జడేజా తమ వారసుడిగా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా పేరును ప్రకటించారు. తమ వారసుడిగా ఉండేందుకు అజయ్ అంగీకరించారని ఓ ప్రకటనలో తెలిపారు. జడేజా 1992-2000 మధ్యకాలంలో భారత్ తరఫున 15 టెస్టులు, 196 వన్డేలు ఆడారు. అనంతరం కొన్ని సినిమాల్లోనూ నటించారు. గత ఏడాది వరల్డ్ కప్‌లో అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్‌కు మెంటార్‌గా కూడా పనిచేశారు.