News August 3, 2024

ఓడిన మహిళా బాక్సర్‌కు 50వేల డాలర్ల బహుమతి!

image

పారిస్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్‌లో ఓటమిపాలైన ఇటాలియన్ బాక్సర్ ఏంజెలా కరీనీకి అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ 50వేల అమెరికన్ డాలర్లు బహుమతిగా ప్రకటించింది. అలాగే ఆమె బాక్సింగ్ ఫెడరేషన్‌, కోచ్‌కు చెరో 25వేల డాలర్లను ఇస్తామని తెలిపింది. అల్జీరియాకు చెందిన ఇమానీ ఖెలీఫ్ చేతిలో కరీనీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమై కరీనీకి సానుభూతి వెల్లువెత్తింది.

Similar News

News March 30, 2026

గాజువాక మర్డర్.. దొరికిన మౌనిక తల

image

గాజువాకలో ప్రియురాలు మౌనికను నేవీ ఉద్యోగి రవీంద్ర ఇంటికి పిలిచి హత్య చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. రెండు <<19511911>>ముక్కలు<<>>గా నరికి ఫ్రిజ్‌లో పెట్టాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శరీర భాగాలు స్వాధీనం చేసుకున్నారు. తల కనపడకపోవడంతో గాలించారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధారపాలెం వద్ద ఆమె తలను గుర్తించినట్లు తెలుస్తోంది.

News March 30, 2026

‘కల్కి’లోకి మరో బాలీవుడ్ యాక్టర్?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి-2’ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం అమితాబ్, కమల్ పాత్రలపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అయితే ఈ సీక్వెల్‌లో కొత్త పాత్ర(నెగటివ్)ను డైరెక్టర్ పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ బాలీవుడ్ నటుడు నటిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రానికి ‘కర్ణ 3102 BC’ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి.

News March 30, 2026

యుద్ధం.. మనకు నష్టం, ఆ దేశాలకు లాభాలు!

image

ఇరాన్, US యుద్ధం వల్ల ఆయిల్, గ్యాస్ దిగుమతులపై ఆధారపడిన భారత్, UK, EU, సౌత్ కొరియా, జపాన్ తీవ్రంగా నష్టపోతున్నాయి. క్రూడ్ ధరల పెరుగుదలతో మన దిగుమతి ఖర్చు పెరిగింది. రూపాయి విలువ 94.8కి పడిపోయింది. క్రూడ్ 10 డాలర్లు పెరిగితే ఇండియాపై అదనంగా $12-18B అదనపు భారం పడుతుంది. సంక్షోభానికి కారణమైన USతోపాటు రష్యా, కెనడా, నార్వే భారీగా లాభపడుతున్నాయి. ఇంధన సరఫరాతో నెలలో ఒక్కో దేశం $3-5B అదనపు ఆదాయం పొందాయి.