News August 3, 2024
ఓడిన మహిళా బాక్సర్‌కు 50వేల డాలర్ల బహుమతి!
పారిస్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్‌లో ఓటమిపాలైన ఇటాలియన్ బాక్సర్ ఏంజెలా కరీనీకి అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ 50వేల అమెరికన్ డాలర్లు బహుమతిగా ప్రకటించింది. అలాగే ఆమె బాక్సింగ్ ఫెడరేషన్, కోచ్‌కు చెరో 25వేల డాలర్లను ఇస్తామని తెలిపింది. అల్జీరియాకు చెందిన ఇమానీ ఖెలీఫ్ చేతిలో కరీనీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమై కరీనీకి సానుభూతి వెల్లువెత్తింది.
Similar News
News September 20, 2024
నెవర్ బిఫోర్ స్థాయికి దేశీయ స్టాక్ మార్కెట్లు
దలాల్ స్ట్రీట్‌లో బుల్ రంకెలేసింది. గ్లోబల్ మార్కెట్స్‌లో పాజిటివ్ సెంటిమెంట్‌తో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం జీవితకాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. సెన్సెక్స్ 1,359 పాయింట్ల లాభంతో 84,544 వద్ద, నిఫ్టీ 375 పాయింట్ల లాభంతో 25,790 వద్ద స్థిరపడ్డాయి. దీంతో BSE నమోదిత సంస్థల ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లకు చేరింది. PSU రంగ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు లాభాలు గడించాయి.
News September 20, 2024
జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
TG: అత్యాచార ఆరోపణలతో చంచల్‌గూడ జైల్లో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు పొందుపరిచారు. ‘2019లో దురుద్దేశంతోనే బాధితురాలిని అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు. 2020లో ముంబైలోని ఓ హోటల్‌లో ఆమెపై అత్యాచారం చేశారు. అప్పుడు ఆమె వయస్సు 16 ఏళ్లు. గత నాలుగేళ్లలో పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నేరాన్ని జానీ అంగీకరించారు’ అని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు.
News September 20, 2024
రాజకీయ కార్యాచరణపై దళపతి విజయ్ ప్రకటన
తమిళగ వెట్రి కళగం మొదటి రాష్ట్ర స్థాయి సదస్సును అక్టోబర్ 27న విల్లుపురం జిల్లాలోని విక్రవాండి వి సలై గ్రామంలో నిర్వహించనున్నట్టు దళపతి విజయ్ ప్రకటించారు. తమిళ ప్రజల అభిమానం, మద్దతుతో తమ విజయవంతమైన రాజకీయ యాత్ర సాగుతోందన్నారు. పార్టీ రాజకీయ భావజాల నేతలను, పార్టీ సిద్ధాంతాలను, విధానాలను, భవిష్యత్తు కార్యాచరణను సదస్సులో ప్రకటించనున్నట్టు విజయ్ తెలిపారు.