News June 3, 2024

అరుదైన వ్యాధి.. మహిళ ప్రేగుల్లో ఆల్కహాల్ ఉత్పత్తి

image

కెనడాలో ‘ఆటో-బ్రూవరీ సిండ్రోమ్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ(50)కు వైద్యులు చికిత్స అందించారు. ఈ వ్యాధి ఉన్నవారి ప్రేగుల్లో శిలీంధ్రాలు కిణ్వ ప్రక్రియతో ఆల్కహాల్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల వారు అస్పష్టంగా మాట్లాడుతూ, పగలు నిద్రపోతూ ఉంటారు. UTI సమస్యలకు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల ఈ సిండ్రోమ్ వస్తుందట. యాంటీ ఫంగల్ ఔషధాలు, లో కార్బోహైడ్రేట్ ఆహారంతో ఆమెకు చికిత్స చేశారు.

Similar News

News September 19, 2024

కొత్త రేషన్ కార్డులపై గుడ్‌న్యూస్

image

TG: అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డుల జారీ విధివిధానాలపై సచివాలయంలో అధికారులతో సీఎం సమీక్షించారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు అందించాలని స్పష్టం చేశారు. కార్డుల జారీకి ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మరోసారి సమీక్ష నిర్వహించాలని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదరలను CM ఆదేశించారు.

News September 19, 2024

మూడు జిల్లాలకు YCP అధ్యక్షుల నియామకం

image

AP: మరో మూడు జిల్లాలకు వైసీపీ అధ్యక్షులను నియమించింది. శ్రీకాకుళం-ధర్మాన కృష్ణదాస్, విజయనగరం-మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్వతీపురం మన్యం-శత్రుచర్ల పరీక్షిత్ రాజు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా తమ్మినేని సీతారాం‌ను నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.

News September 19, 2024

సీఎం సహాయనిధికి సింగరేణి విరాళం

image

TG: వరద బాధితుల సహాయం కోసం సీఎం సహాయనిధికి సింగరేణి సంస్థ భారీ విరాళం అందించింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి సింగరేణి ఎండీ బలరాం, ఎమ్మెల్యే, కార్మిక సంఘాల నేతలు సచివాలయంలో రూ.10.25 కోట్ల చెక్కులను అందించారు. దీంతో సింగరేణి ఉద్యోగులను సీఎం రేవంత్ అభినందించారు.