News March 30, 2024

రికార్డు సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ

image

సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ భారత బ్యాడ్మింటన్ చరిత్రలో మరో రికార్డు నెలకొల్పారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం (10 వారాలు) అగ్రస్థానంలో కొనసాగిన జోడీగా రికార్డు సృష్టించారు. ఇదివరకు ఈ రికార్డు సైనా నెహ్వాల్ (9 వారాలు) పేరిట ఉండేది. ఆమె ఆగస్టు 18, 2015 నుంచి అక్టోబర్ 21, 2015 వరకు నంబర్ 1గా కొనసాగారు.

Similar News

News November 3, 2025

బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం

image

TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్​ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్​కు తరలించి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్​, డీజీపీలను ఆదేశించారు.

News November 3, 2025

గుండెలు పగిలే ఫొటో

image

TG: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో జరిగిన <<18183124>>ఆర్టీసీ బస్సు ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 17 మంది మరణించగా, అందులో 10 నెలల పాప కూడా ఉంది. తల్లి, బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫొటో కన్నీరు తెప్పిస్తోంది. ప్రమాద సమయంలో టిప్పర్ మితిమీరిన వేగంతో వెళ్లినట్లు సమాచారం. ఘటనాస్థలం వద్ద ప్రయాణికుల ఆర్తనాదాలతో భీతావహ వాతావరణం నెలకొంది.

News November 3, 2025

బాత్రూమ్‌లోనే గుండెపోట్లు ఎక్కువ.. ఎందుకంటే?

image

బాత్రూమ్‌లో ఎక్కువగా గుండెపోటు కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీనికి స్నానం ప్రధాన కారణం కాదని, మలమూత్ర విసర్జన సమయంలో ఎక్కువగా ఒత్తిడి చేయడమే అసలు సమస్యని స్పష్టం చేశారు. ఈ ఒత్తిడి వల్ల ‘వాల్సాల్వా మ్యాన్యువర్’ జరిగి రక్తపోటులో ఆకస్మిక హెచ్చుతగ్గులు సంభవిస్తాయని తెలిపారు. దీనివల్ల రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయిన వారికి ఆక్సిజన్ సరఫరా తగ్గి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.