News March 30, 2024

రికార్డు సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ

image

సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ భారత బ్యాడ్మింటన్ చరిత్రలో మరో రికార్డు నెలకొల్పారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం (10 వారాలు) అగ్రస్థానంలో కొనసాగిన జోడీగా రికార్డు సృష్టించారు. ఇదివరకు ఈ రికార్డు సైనా నెహ్వాల్ (9 వారాలు) పేరిట ఉండేది. ఆమె ఆగస్టు 18, 2015 నుంచి అక్టోబర్ 21, 2015 వరకు నంబర్ 1గా కొనసాగారు.

Similar News

News February 12, 2026

TG CET హాల్ టికెట్లు విడుదల

image

తెలంగాణ గురుకులం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG CET–2026) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నేటి నుంచి ఈ నెల 22 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 2026-27 అకడమిక్ ఇయర్‌కి సంబంధించి 5-9 తరగతుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News February 12, 2026

ఉత్తరంలో ఇల్లు కడితే కుబేరులు అవుతారా ?

image

ఉత్తరానికి అధిపతి కుబేరుడు. ఆ దిశలో ఇల్లు కడితే సంపన్నులవుతారని కొందరి అభిప్రాయం. అయితే ఇలా ఉత్తరదిశలో ఉన్న ఇంట్లో నివసిస్తున్న అందరూ కుబేరులవుతారనడం అపోహేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు స్పష్టం చేస్తున్నారు. ఈ వాస్తు నియమం పాటిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి సకల కార్యాలు పూర్తయ్యేలా దోహదం చేస్తుందని చెబుతున్నారు. సంపద పెరిగే అవకాశాలు మెరుగుపడుతాయే తప్ప సంపద పెరగదు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 12, 2026

లైఫ్‌లో ఎన్నిసార్లు ప్రేమలో పడతారు..?

image

జీవితంలో ఒక మనిషి సగటున 2సార్లు గాఢంగా ప్రేమిస్తారని కిన్సీ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. 18-99సం.ల మధ్య గల 10వేల మందిపై సర్వే చేయగా.. 14% అసలు పిచ్చి ప్రేమలో పడబోమని, 28% ఒకసారి, 30% రెండు సార్లు, 17% మూడుసార్లు, 11% 4లేదా అంతకంటే ఎక్కువ సార్లు లవ్‌లో మునిగి తేలుతామన్నారట. ప్రేమ, ఆకర్షణకు తేడా గుర్తించక ప్రతి ఫీలింగ్‌నూ లవ్ అనుకుని ఆ రిలేషన్ మొదట్లో పొరబడతారట. ఈ సర్వేలో మీది ఏ బ్యాచ్? కామెంట్.