News May 3, 2024
YCP ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట

వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివేకానందరెడ్డి హత్య కేసులో అతడికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఈ పిటిషన్ వేశారు. ఇదే కేసులో అవినాశ్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డికి అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేసింది.
Similar News
News December 17, 2025
SRH మేనేజ్మెంట్పై ఫ్యాన్స్ ఫైర్

IPL-2026 సీజన్‌కు SRH టీమ్‌లో స్టార్ బౌలర్లు లేరని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. హర్షల్ పటేల్, పాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కట్ ఉన్నా వాళ్లు భారీగా రన్స్ సమర్పించుకునే వారేనని గుర్తుచేస్తున్నారు. ఇషాన్ మలింగా, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలె, అమిత్ కుమార్, శివమ్ మావిలకు అనుభవం లేదని గుర్తుచేస్తున్నారు. స్టార్ బౌలర్లు లేకుండా టీమ్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తారని మండిపడుతున్నారు.
News December 17, 2025
ఎంపీలందరూ సభలో ఉండాలని కాంగ్రెస్ విప్.. జర్మనీలో రాహుల్!

MGNREGA పేరు మార్చే బిల్లు ఒకటీరెండు రోజుల్లో పార్లమెంటు ముందుకు రానుంది. ఈ క్రమంలో రానున్న 3 రోజులు హాజరుకావాలని పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. కానీ ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మాత్రం ప్రస్తుతం జర్మనీలో ఉండటం గమనార్హం. దీంతో రాహుల్ విషయంలో LoP అంటే లీడర్ ఆఫ్ పర్యటన్ అని బీజేపీ సెటైర్లు వేసింది. ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ అని, శాశ్వతంగా వెకేషన్ మోడ్‌లో ఉంటారని విమర్శించింది.
News December 16, 2025
Photos: వనతారలో మెస్సీ పూజలు

‘గోట్ టూర్’లో భాగంగా ఇండియాలో పర్యటిస్తున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఇవాళ గుజరాత్‌కు వెళ్లారు. అంబానీ ఫ్యామిలీకి చెందిన వనతారను సందర్శించారు. తన తోటి ప్లేయర్లు సురెజ్, రోడ్రిగోతో కలిసి అక్కడి ఆలయంలో పూజలు చేశారు. నుదుటిన బొట్టుతో, హారతి ఇస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారితోపాటు అనంత్ అంబానీ, రాధిక దంపతులు ఉన్నారు.


