News December 3, 2024

విద్యార్థికి రూ.4.3 కోట్ల వేతన ప్యాకేజీ

image

IIT మద్రాస్‌లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థికి రూ.4.3 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. హాంకాంగ్‌లోని గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ ఈ జాబ్ ఆఫర్‌ను ఇచ్చింది. జీతం, బోనస్, రీలొకేషన్‌తో కూడిన ఈ ప్యాకేజీ ఈ సీజన్‌లోనే అత్యధికం కావడం విశేషం. అతని పేరు ఇంకా బయటకు రాలేదు. బ్లాక్‌రాక్, గ్లీన్, డా విన్సీ వంటి సంస్థలు పలువురికి రూ.2 కోట్ల కంటే ఎక్కువ ప్యాకేజీలను అందించాయి.

Similar News

News December 25, 2025

ఐటీ జాబ్ వదిలి వ్యవసాయం.. రోజూ రూ.15వేలు ఆదాయం

image

రూ.లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగం వదిలి.. సాగు బాట పట్టి సక్సెస్ అయ్యారు ఝార్ఖండ్‌‌లోని అంబతాండ్‌కు చెందిన యువరైతు ఉదయ్ కుమార్. బీటెక్ పూర్తి చేసి పుణేలో IT జాబ్ పొందిన ఉదయ్ సొంతూరిని వదిలి ఉండలేకపోయారు. 6 నెలలకే జాబ్ వదిలి, ఊరుకు వచ్చి 20 ఎకరాల్లో మిరప, టమాటా, క్యాబేజీ, బఠాణీ పండిస్తూ రోజూ రూ.15వేలకు పైగా ఆర్జిస్తున్నారు. ఉదయ్ పడ్డ కష్టాలు, సక్సెస్‌కు కారణాల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 25, 2025

క్రిస్మస్ శుభాకాంక్షలు

image

అంతటా క్రిస్మస్ శోభ వెల్లివిరుస్తోంది. ప్రపంచమంతా కలిసి జరుపుకునే అతి పెద్ద పండుగ ఇది. యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు అంతా పవిత్ర పండుగగా జరుపుకుంటారు. పాపాన్ని త్యజించి మనసా, వాచా, కర్మణా పరిశుద్ధ జీవితం కొనసాగించినప్పుడే పరలోక ప్రాప్తి లభిస్తుందని యేసు బోధించారు. చెడును విడిచి మంచిని పంచిన వారి హృదయాల్లోనే ఆయన ఉంటాడని చెబుతారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.

News December 25, 2025

ఇతిహాసాలు క్విజ్ -107

image

ఈరోజు ప్రశ్న: తన పరమ భక్తుడిని రక్షించడం కోసం ఓ దేవుడు ఒకే సమయంలో అటు మనిషిగా కాకుండా, ఇటు జంతువుగా కాకుండా సగం మానవ, సగం మృగం రూపాన్ని ధరించాడు. ఆ దేవుడెవరు? ఆయన ఎవరిని రక్షించారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>