News December 3, 2024
విద్యార్థికి రూ.4.3 కోట్ల వేతన ప్యాకేజీ

IIT మద్రాస్‌లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థికి రూ.4.3 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. హాంకాంగ్‌లోని గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ ఈ జాబ్ ఆఫర్‌ను ఇచ్చింది. జీతం, బోనస్, రీలొకేషన్‌తో కూడిన ఈ ప్యాకేజీ ఈ సీజన్‌లోనే అత్యధికం కావడం విశేషం. అతని పేరు ఇంకా బయటకు రాలేదు. బ్లాక్‌రాక్, గ్లీన్, డా విన్సీ వంటి సంస్థలు పలువురికి రూ.2 కోట్ల కంటే ఎక్కువ ప్యాకేజీలను అందించాయి.
Similar News
News February 12, 2026
లిక్కర్ స్కామ్‌కు రాజ్ కసిరెడ్డే ఆర్కిటెక్ట్: సుప్రీంకోర్టు

AP: మద్యం కుంభకోణానికి రాజ్ కసిరెడ్డే ఆర్కిటెక్ట్ అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారించేందుకు నిరాకరించింది. దీంతో పిటిషన్ వెనక్కి తీసుకుంటామని రాజ్ తరఫు న్యాయవాది చెప్పగా ధర్మాసనం అనుమతించింది. ఏపీ లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
News February 12, 2026
విదేశీ విద్యపై మోజు తగ్గుతోంది..

భారతీయ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యపై మోజు తగ్గుతోంది. అబ్రాడ్‌కు వెళ్లే వారి సంఖ్య రెండేళ్లలో 31% తగ్గడమే ఇందుకు నిదర్శనం. 2023లో ఫారిన్‌కు 9.8L మంది వెళ్లారు. ఆ సంఖ్య 2024లో 7.7L ఉండగా 2025 నాటికి 6.26Lకు పడిపోయింది. ‘విదేశీ చదువు వారి వ్యక్తిగతం. ఆర్థిక స్తోమత, బ్యాంకు లోన్లు పొందడం, పలు దేశాలను చూడాలనుకోవడం.. ఇలా పలు అంశాలు ప్రభావితం చేస్తాయి’ అని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
News February 12, 2026
లో దుస్తుల్ని ఎలా ఎంచుకోవాలంటే?

మనం నిత్యం ధరించే లోదుస్తుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరీ బిగుతుగా కాకుండా సరైన సైజ్ లోదుస్తులే వాడాలి. సింథటిక్, నాన్ బ్రీతబుల్ మెటీరియల్ వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఇవి చెమటలను పీల్చుకోకపోగా బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతాయంటున్నారు. అలాగే మరీ లూజ్‌గా ఉన్నవి వేసుకున్నా అసౌకర్యంగా ఉండటంతో పాటు మెడ, భుజాల నొప్పికి కూడా దారితీస్తాయంటున్నారు.


