News May 10, 2024
IPLలో సంచలనం

CSKతో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సంచలనం సృష్టించారు. IPLలో ఫస్ట్ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం(210 రన్స్) నెలకొల్పిన రెండో జంటగా నిలిచారు. ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు బాదడం మరో విశేషం. 2022లో KKRతో మ్యాచ్‌లో LSG ఓపెనర్లు కేఎల్ రాహుల్, డికాక్ తొలి వికెట్‌కు అజేయంగా 210 పరుగులు చేశారు.
Similar News
News December 8, 2025
టెన్త్ అర్హతతో 25,487పోస్టులు.. దరఖాస్తు చేశారా?

<
News December 8, 2025
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ షెడ్యూల్

*ఇవాళ 1.30PMకు గవర్నర్ ఈ సదస్సును ప్రారంభిస్తారు
*ప్రజాపాలన, రెండేళ్లలో సాధించిన ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలను సీఎం రేవంత్ రెడ్డి గెస్టులకు వివరిస్తారు
*3PM-7PM వరకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి, కొరియా బృందం, ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్, ఐకియా, వరల్డ్ బ్యాంక్, SIDBI సహా వివిధ రకాల పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అవుతారు.
News December 8, 2025
హీరోయిన్‌కు వేధింపులు.. మలయాళ నటుడిని నిర్దోషిగా తేల్చిన కోర్టు

హీరోయిన్‌పై లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు కేరళలోని ఎర్నాకులం జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. వారికి శిక్షను ఈనెల 12న ప్రకటించనుంది. 2017లో సినీ నటిపై వేధింపుల కేసులో దిలీప్ అరెస్టయ్యారు. కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. దాదాపు 8 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది.


