News March 21, 2024
వైసీపీకి ఎదురుదెబ్బ.. పార్టీ మారనున్న మరో ఎంపీ?

AP: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ YCPకి మరో ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ఆమె భర్త తాళ్ల సత్యనారాయణ మూర్తి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. తాజాగా మూర్తి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరిని కలిశారు. అమలాపురం ఎంపీ లేదా పి.గన్నవరం అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అమలాపురం ఎంపీ సీటుకు రాపాక వరప్రసాద్ పేరును వైసీపీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News April 7, 2025
నాని ‘ది ప్యారడైజ్’లో ఉప్పెన బ్యూటీ?

‘ది ప్యారడైజ్’ మూవీ ఫస్ట్ లుక్‌తోనే అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేశారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. హీరో నానిని సరికొత్తగా చూపిస్తోండగా తాజాగా మరో న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాలో ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి నటించనుందని తెలుస్తోంది. ఇదే విషయమై హీరోయిన్‌తో దర్శకుడు చర్చల్లో ఉన్నట్లు సమాచారం. ‘దసరా’లో కీర్తిని డీగ్లామర్‌గా చూపించగా ఈ మూవీలో బేబమ్మను ఎలా చూపిస్తారో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
News April 7, 2025
ఫేక్ ప్రచారంపై ప్రముఖులను విచారించేందుకు ప్రభుత్వం చర్యలు!

TG: HCU భూములపై ఫేక్ ప్రచారం చేసిన ప్రముఖులను విచారించేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత జగదీశ్, నటులు జాన్ అబ్రహం, రవీనా టాండన్, ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ తదితర ప్రముఖులను విచారించనున్నట్లు సమాచారం. కాగా HCU భూములపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈనెల 24లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.
News April 7, 2025
ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట

AP: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆయనను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కావాలని మిథున్ రెడ్డి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.