News March 21, 2024

వైసీపీకి ఎదురుదెబ్బ.. పార్టీ మారనున్న మరో ఎంపీ?

image

AP: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ YCPకి మరో ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ఆమె భర్త తాళ్ల సత్యనారాయణ మూర్తి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. తాజాగా మూర్తి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరిని కలిశారు. అమలాపురం ఎంపీ లేదా పి.గన్నవరం అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అమలాపురం ఎంపీ సీటుకు రాపాక వరప్రసాద్‌ పేరును వైసీపీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News September 8, 2024

ఏలియన్స్‌పై అమెరికా అధ్యయనం: మాజీ అధికారి

image

అమెరికా రక్షణ కార్యాలయంలో పనిచేసిన లూయిస్ ఎలిజోండో అనే అధికారి సంచలన ప్రకటన చేశారు. తమకు చిక్కిన గ్రహాంతరవాసులు, వారి నౌకపై అమెరికా అధ్యయనం చేసిందని వెల్లడించారు. ‘గ్రహాంతరవాసులు, వారి వాహనాలపై అమెరికా పరిశోధనలు జరిపింది. వాటి ఉనికి గురించి దశాబ్దాల క్రితమే తెలిసినా రహస్యంగా ఉంచుతోంది. విశ్వంలో మనం ఒంటరి కాదు’ అని పేర్కొన్నారు. కాగా.. లూయిస్ ఆరోపణలు నిరాధారమైనవంటూ అమెరికా ఖండించింది.

News September 8, 2024

‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మహేశ్ బాబు?

image

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే తారక్, మహేశ్‌ను ఒకే వేదికపై చూసే ఛాన్స్ కలుగుతుందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఈ నెల 10న దేవర ట్రైలర్‌ను ముంబైలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.

News September 8, 2024

గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ

image

APలో భారీ వర్షాలు, విజయవాడలో బుడమేరుతో సంభవించిన వరద పరిస్థితులను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి CM చంద్రబాబు వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రేయింబవళ్లు అధికార యంత్రాంగం పనిచేసిందని, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలను తెలియజేశారు. వరద వల్ల భారీ నష్టం జరిగిందని గవర్నర్‌కు చెప్పారు. అటు త్వరలోనే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.