News April 11, 2024
‘సున్నా కరెంట్ బిల్లు’ లబ్ధిదారులకు షాక్!

TG: ‘గృహజ్యోతి’ లబ్ధిదారులకు ఎన్నికల కోడ్ షాక్ ఇచ్చింది. పలు ప్రాంతాల్లో గత నెలలో ఇచ్చిన ‘సున్నా’ బిల్లులను వెనక్కి తీసుకుంది. HYDలోని సరూర్‌నగర్‌లో ఓ వినియోగదారుడికి మార్చి 2న రూ.262తో జీరో బిల్లు ఇచ్చారు. ఈనెల రూ.547 రాగా.. మొత్తం కలిపి రూ.809 చెల్లించాలని కొత్త బిల్లు జారీ చేశారు. అయితే.. సాంకేతిక సమస్యతో మార్చిలో సున్నా బిల్లులు జారీ అయ్యాయని డిస్కం అధికారులు చెప్పారు.
Similar News
News March 22, 2025
బ్యాంకుల సమ్మె వాయిదా

ఈనెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) ప్రకటించింది. వారంలో ఐదు రోజుల పని, అన్ని క్యాడర్లలో తగినన్ని నియామకాలు చేపట్టడం వంటి డిమాండ్ల విషయంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA), కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
News March 22, 2025
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నిధుల విడుదల

AP: ఫీజు రియంబర్స్‌మెంట్ పథకానికి రూ.600 కోట్ల నిధులు విడుదల చేసినట్లు విద్యాశాఖ కార్యదర్శి ప్రకటించారు. త్వరలో మరో రూ.400కోట్లు రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో ఇప్పటివరకూ ఈ పథకానికి మెుత్తంగా రూ.788కోట్లు విడుదలయినట్లు పేర్కొన్నారు. పెండింగ్ బకాయిలు సైతం త్వరలోనే చెల్లిస్తామని అయితే ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులు పెడితే మాత్రం కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
News March 22, 2025
బీఆర్ఎస్ DNAలోనే అవినీతి ఉంది: మంత్రి సీతక్క

TG: కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు చేస్తున్న సంక్షేమాన్ని చూసి BRS ప్రభుత్వం ఓర్వలేకపోతోందని మంత్రి సీతక్క విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే త్యాగాలకు మారుపేరని తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర పరువు తీసిందని, ఆపార్టీ DNAలోనే అవినీతి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ DNAలోనే అవినీతి ఉందని శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలకు మంత్రి ఇలా కౌంటరిచ్చారు.