News November 30, 2024

ప్రజలకు షాక్.. రేపటి నుంచి విద్యుత్ ఛార్జీల పెంపు

image

AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు ERC ఓకే చెప్పింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రూ.9,412 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలను వసూలు చేయాలని ఆదేశించింది. యూనిట్‌కు 92 పైసల చొప్పున రేపటి నుంచి 2026 నవంబర్ వరకు వసూలు చేయాలంది. రూ.9,412 కోట్లలో వ్యవసాయ విద్యుత్ రాయితీ రూ.1,500 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు రూ.7,912 కోట్లు ప్రజలపై భారం పడనుంది.

Similar News

News December 5, 2024

కిమ్ జోంగ్ ఉన్‌లా చంద్రబాబు ధోరణి: VSR

image

AP: CM చంద్రబాబు ధోరణి ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌లా ఉందని YCP MP విజయసాయిరెడ్డి మండిపడ్డారు. CM నియంతృత్వ ధోరణితో YCP నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారని ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం అణచివేత చర్యలు ఆయన పిరికితనానికి నిదర్శనం. ఆయన రాజకీయ ప్రతీకారానికి ఎలాంటి జస్టిఫికేషన్ లేదు. ప్రజలు జీవించే హక్కు కోల్పోయి అధికార పార్టీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతుకుతున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News December 5, 2024

డిసెంబర్ 5: చరిత్రలో ఈ రోజు

image

* 1901: హాలీవుడ్ దర్శకుడు వాల్ట్ డిస్నీ జననం
* 1905: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం షేక్ అబ్దుల్లా జననం
* 1985: టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ ధవన్ జననం
* 1992: హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ జననం
* 2013: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మరణం
* 2016: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం
* ప్రపంచ నేల దినోత్సవం .

News December 5, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.