News August 27, 2024
యూట్యూబ్ యూజర్లకు షాక్

యాడ్స్ లేకుండా కంటెంట్ వీక్షించే ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలను యూట్యూబ్ పెంచింది. గతంలో రూ.129 ఉన్న వ్యక్తిగత ప్రీమియం నెల ప్లాన్ ధర ఇప్పుడు రూ.149కి చేరింది. ఫ్యామిలీ ప్రీమియం ధర రూ.189 నుంచి రూ.299కి, ప్రీమియం స్టూడెంట్ ప్లాన్ రూ.79 నుంచి 89కి పెరిగాయి. ప్రీపెయిడ్తో పాటు రెన్యువల్ సబ్స్క్రిప్షన్ ధరల్ని కూడా యూట్యూబ్ సవరించింది.
Similar News
News November 27, 2025
HYD: ‘మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయండి’

మహిళల భద్రతే తమ లక్ష్యమని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల్లో మహిళలను వేధించిన 110 మంది వ్యక్తులను పట్టుకున్నామన్నారు. మహిళలకు ఎవరు ఇబ్బంది కలిగించినా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, వేధింపులకు పాల్పడిన వారిని ఆధారాలతో కోర్టుకు హాజరు పరుస్తూ.. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు.
News November 27, 2025
వారికి నిద్ర అవసరం: సుందర్ పిచాయ్

‘జెమిని 3’ మోడల్ కోసం తన బృందం కొన్ని వారాల పాటు విరామం లేకుండా పని చేసిందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ‘ఉద్యోగులంతా ఎంతో అలసిపోయారు. కొందరికి నిద్ర అవసరం. ఇప్పుడు తగిన విశ్రాంతి దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. ‘గూగుల్ ఏఐ: రిలీజ్ నోట్స్’ పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడారు. జెమిని 3 ఏఐ మోడల్ను ఇటీవల గూగుల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
News November 27, 2025
నిర్మాతలను బ్లేమ్ చేయొద్దు: SKN

కంఫర్ట్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తూ ప్రొడ్యూసర్స్ను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని ప్రేక్షకులనుద్దేశించి నిర్మాత SKN పేర్కొన్నారు. ‘మనం కంఫర్ట్, లగ్జరీ కావాలి అనుకున్నప్పుడే ఎక్కువ పే చేయాలి. కేవలం కంఫర్ట్ కోసమే ఎక్స్ట్రా చెల్లిస్తున్నాం. లగ్జరీ థియేటర్లో చూడాలంటే రియల్ఎస్టేట్ వాల్యూ ప్రకారం టికెట్, రిఫ్రెష్మెంట్ రేట్లుంటాయి. వాటితో నిర్మాతకొచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమీ ఉండదు’ అని తెలిపారు.


