News March 17, 2024
‘గూగుల్ తప్పు’ అని సైన్ బోర్డు

మీరు గూగుల్ మ్యాప్స్ చూస్తూ కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఉన్న క్లబ్ మహీంద్రాకు వెళ్లాలనుకుంటే.. మీకు ఒక సైన్ బోర్డు ఎదురవుతుంది. దానిపై ‘గూగుల్ తప్పు.. ఈ రోడ్డు క్లబ్ మహీంద్రాకు వెళ్లదు’ అని రాసి ఉంటుంది. ట్రావెలర్స్ గూగుల్ మ్యాప్స్లో చూస్తూ క్లబ్ మహీంద్రాకు వెళ్లబోయి దారి తప్పుతున్న సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అందరికీ చెప్పడం కష్టం కావడంతో.. అక్కడి స్థానికులు ఇలా బోర్డులు ఏర్పాటు చేశారు.
Similar News
News November 14, 2025
ఆర్చరీలో సత్తా చాటిన తెలుగు కుర్రాడు

ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర(VJA) చరిత్ర సృష్టించారు. వ్యక్తిగత విభాగంలో రాహుల్(IND)పై 6-2 తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ సాధించారు. మహిళల విభాగంలో అంకితా భకత్ 7-3 తేడాతో సౌ.కొరియా ఆర్చర్ నామ్ సు-హ్యోన్పై నెగ్గి గోల్డ్ గెలిచారు. ఏషియన్ రికర్వ్ ఆర్చరీలో INDకు ఇవే తొలి వ్యక్తిగత గోల్డ్ మెడల్స్ కావడం విశేషం. ఈ టోర్నీలో IND 6 గోల్డ్, 3 సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ నెగ్గింది.
News November 14, 2025
8 రోజులు క్రిస్మస్ సెలవులు!

తెలుగు రాష్ట్రాల్లోని క్రిస్టియన్ మైనార్టీ స్కూలు విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా 21 నుంచి 28 వరకు హాలిడేస్ ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది. అటు మిగతా స్కూల్ విద్యార్థులకు క్రిస్మస్ రోజు మాత్రమే సెలవు ఉంటుంది.
News November 14, 2025
WATER SCARCITY.. ఆరుతడి పంటలే వేయాలి: కృష్ణాడెల్టా CE

AP: 2026 మే వరకు సాగు, తాగు అవసరాలకు 228 TMCల నీరు అవసరమని కృష్ణాడెల్టా CE రాంబాబు తెలిపారు. ‘శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి వినియోగించినది పోగా AP వాటా ఇంకా 118 TMCలే ఉంది. పులిచింతలలోని 40 TMCలను కలిపితే మొత్తం 158TMCలు అందుబాటులో ఉంది. ప్రస్తుత అవసరాలను దీనితోనే తీర్చాలి’ అని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు రబీ పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలే వేసుకోవాలని సూచించారు.


