News March 17, 2024

‘గూగుల్ తప్పు’ అని సైన్ బోర్డు

image

మీరు గూగుల్ మ్యాప్స్ చూస్తూ కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఉన్న క్లబ్ మహీంద్రాకు వెళ్లాలనుకుంటే.. మీకు ఒక సైన్ బోర్డు ఎదురవుతుంది. దానిపై ‘గూగుల్ తప్పు.. ఈ రోడ్డు క్లబ్ మహీంద్రాకు వెళ్లదు’ అని రాసి ఉంటుంది. ట్రావెలర్స్ గూగుల్ మ్యాప్స్‌లో చూస్తూ క్లబ్ మహీంద్రాకు వెళ్లబోయి దారి తప్పుతున్న సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అందరికీ చెప్పడం కష్టం కావడంతో.. అక్కడి స్థానికులు ఇలా బోర్డులు ఏర్పాటు చేశారు.

Similar News

News October 16, 2024

INDvsNZ: తొలి రోజు ఆట అనుమానమే!

image

న్యూజిలాండ్, భారత్ మధ్య బెంగళూరు వేదికగా ఇవాళ తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. వర్షం కారణంగా టాస్ వాయిదా పడింది. కాసేపటి క్రితమే వాన ఆగిపోయినట్లు తెలుస్తోంది. మళ్లీ వర్షం మొదలైతే తొలి రోజు ఆట తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. కాగా బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో బెంగళూరులో నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి.

News October 16, 2024

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

పెళ్లిళ్ల సీజన్ వేళ వినియోగదారులకు పసిడి ధరలు షాక్ ఇస్తున్నాయి. HYD బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్ రూ.78వేలకు చేరువైంది. నిన్న, మొన్నటి వరకు కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.490 పెరిగి రూ.77,890కి చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రూ.450 పెరిగి రూ.71,400గా నమోదైంది. అటు సిల్వర్ రేట్ రూ.100 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.96,800గా ఉంది.

News October 16, 2024

STOCK MARKETS: మిక్స్‌డ్ సిగ్నల్స్.. ఫ్లాట్ ఓపెనింగ్

image

ఆసియా మార్కెట్ల నుంచి మిక్స్‌డ్ సిగ్నల్స్ రావడం, కంపెనీల ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు నేడు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. నిఫ్టీ 25,067 (10), సెన్సెక్స్ 81,834 (13) వద్ద ట్రేడవుతున్నాయి. NSEలో 73 స్టాక్స్ 52WEEK గరిష్ఠాన్ని తాకాయి. HDFC లైఫ్, హిందాల్కో, ఏషియన్ పెయింట్స్, SBI లైఫ్, HDFC బ్యాంక్ టాప్ గెయినర్స్. M&M, నెస్లే, ట్రెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐచర్ మోటార్స్ టాప్ లూజర్స్.