News July 30, 2024
సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి: హరీశ్

TG: ఈ ఒక్కరోజే రాష్ట్రంలో 4 అత్యాచారాలు(వనస్థలిపురం, OU పీఎస్ పరిధి, శాలిగౌరారం, నిర్మల్-ప్రకాశం బస్సులో) జరగడం బాధాకరమని BRS MLA హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ‘సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. అత్యాచారాల గురించి అసెంబ్లీలో మాట్లాడి 48గంటలు కాలేదు. మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు ఆందోళనకరం. బాధితులకు భరోసా కల్పించాలి. కారకులకు కఠిన శిక్ష పడేలా చేయాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News July 8, 2025
గోదావరికి వరద ఉద్ధృతి

AP: శబరి, సీలేరు వరదతో గోదావరి నదిలో ప్రవాహం పెరిగింది. పోలవరం ప్రాజెక్టు వద్ద 48 గేట్లు ఎత్తి 1.95 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. అటు ధవళేశ్వరం బ్యారేజీకి 2.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మహారాష్ట్రలో వర్షాలు మరింత ఊపందుకుంటాయని, 3-4 రోజుల్లో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
News July 8, 2025
ఈ లక్షణాలుంటే కఠిక పేదరికమే: చాణక్య నీతి

ఏ ఇంట్లో స్త్రీకి సముచిత స్థానం, తగిన మర్యాద దక్కదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని చాణక్య నీతి చెబుతోంది. అహంకారం, మోసం చేసే గుణాలున్న వారు మొదట లాభపడవచ్చు. కానీ, వారింట లక్ష్మి నిలవదు. పరిస్థితిని అంచనా వేయకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే వ్యాపారి, ఉద్యోగి ఇబ్బందులు పడక తప్పదు. అలాంటి వారికి లక్ష్మీ కటాక్షం ఉండదని చాణక్య నీతిలో ఉంది.
News July 8, 2025
రాష్ట్రంలో రానున్న 3 రోజులు వర్షాలు

AP: పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోందని IMD తెలిపింది. దీనికి అనుగుణంగా ద్రోణి కూడా కొనసాగుతోంది. రానున్న రెండ్రోజుల్లో అల్పపీడనం ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌వైపు కదులుతుంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించింది.