News August 12, 2024
గజరాజులకు స్పెషల్ విందు
ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జూలో ఉన్న వనజ, ఆశా, సీత, విజయ్ అనే పేరుగల నాలుగు ఆసియా ఏనుగులకు స్పెషల్ విందు ఏర్పాటు చేశారు. పచ్చి సలాడ్, బెల్లం, చెరుకుతో పాటు పండ్లు, కొబ్బరికాయలతో ప్రత్యేక విందును అందించారు. వీటిని అవి ఎంతో ఇష్టంగా ఆరగించాయి. దీనికి సంబంధించిన ఫొటోలను అదికారులు షేర్ చేశారు.
Similar News
News September 18, 2024
ఏపీ, తెలంగాణకు ట్రైనీ ఐపీఎస్‌ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు ఎనిమిది మంది ట్రైనీ ఐపీఎస్‌లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు దీక్ష(హరియాణా), బొడ్డు హేమంత్(ఏపీ), మనీషా వంగల రెడ్డి(ఏపీ), సుష్మిత(తమిళనాడు), తెలంగాణకు మనన్ భట్(జమ్ముూకశ్మీర్), రుత్విక్ సాయి(TG), సాయి కిరణ్(TG), యాదవ్ వసుంధర(UP)ను కేంద్రం కేటాయించింది.
News September 18, 2024
BREAKING: జానీ మాస్టర్‌పై పోక్సో కేసు
TG: జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మైనర్‌గా ఉన్నప్పటి నుంచి లైంగికంగా ఇబ్బందిపెట్టారన్న ఫిర్యాదుతో దాన్ని పోక్సో కేసుగా మార్చారు. తొలుత బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా, అక్కడ అత్యాచారం కేసుపై FIR నమోదైంది. ఆ తర్వాత దాన్ని నార్సింగి పీఎస్‌కు బదిలీ చేశారు.
News September 18, 2024
ముగిసిన క్యాబినెట్ భేటీ
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముగిసింది. 4 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.