News March 4, 2025
హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణలో ముందడుగు

హైదరాబాద్-విజయవాడ NH-65 రహదారి 6 లేన్ల విస్తరణ విషయంలో కీలక ముందడుగు పడింది. డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(DPR) రూపొందించే బాధ్యతల్ని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ సంస్థ దక్కించుకుంది. ఈ నెలాఖరుకల్లా ఈ సంస్థతో కేంద్రం ఒప్పందం ఖరారు కానుంది. డీపీఆర్ తయారీకి రూ.9.86 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. TGలోని దండు మల్కాపూర్ నుంచి APలోని గొల్లపూడి వరకు 265 కి.మీ మేర హైవే విస్తరణ జరగనుంది.
Similar News
News October 21, 2025
HYD: BRS నేతల మాటలు హాస్యాస్పదం: మంత్రి

మాఫియా, డాన్లు, కాంట్రాక్టులు, కమీషన్ల గురించి BRS నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మంగళవారం HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. బ్లాక్ మెయిలింగ్ చేయడంలో బాల్క సుమన్ దిట్ట అని విమర్శించారు. RS ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ మంత్రుల గురించి మాట్లాడే ముందు KCR పదేళ్ల పాలనపై ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. KCR హయాంలో గురుకులాలు అస్తవ్యస్తంగా అయ్యాయన్నారు.
News October 21, 2025
అతి భారీ వర్ష సూచన.. స్కూళ్లకు సెలవు

AP: అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధికారులు రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రేపు ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA వెల్లడించింది. ఈ నేపథ్యంలో వర్షాలు పడే అవకాశమున్న మిగతా జిల్లాల్లోనూ పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని పేరెంట్స్, స్టూడెంట్స్ కోరుతున్నారు.
News October 21, 2025
ఆయన భారత్‌ను ఎంచుకున్నారు.. లోకేశ్ ట్వీట్ వైరల్!

AP: వైజాగ్‌లో $15B పెట్టుబడులతో గూగుల్ డేటా-Ai హబ్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాడులో అధికార DMK, ప్రతిపక్ష AIADMK మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గూగుల్‌ను TNకు తీసుకురావడంలో CM స్టాలిన్ ఫెయిలయ్యారని, తమిళుడైన గూగుల్ CEO పిచయ్ APని ఎంచుకున్నారని AIADMK చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘ఆయన భారత్‌ను ఎంచుకున్నారు’ అంటూ హుందాగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది.