News March 4, 2025

హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణలో ముందడుగు

image

హైదరాబాద్-విజయవాడ NH-65 రహదారి 6 లేన్ల విస్తరణ విషయంలో కీలక ముందడుగు పడింది. డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(DPR) రూపొందించే బాధ్యతల్ని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ సంస్థ దక్కించుకుంది. ఈ నెలాఖరుకల్లా ఈ సంస్థతో కేంద్రం ఒప్పందం ఖరారు కానుంది. డీపీఆర్ తయారీకి రూ.9.86 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. TGలోని దండు మల్కాపూర్ నుంచి APలోని గొల్లపూడి వరకు 265 కి.మీ మేర హైవే విస్తరణ జరగనుంది.

Similar News

News February 14, 2026

అప్పు తీర్చడానికి మళ్లీ అప్పు: పయ్యావుల

image

AP: పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వంలో రాష్ట్రం ₹9.74లక్షల కోట్ల అప్పుతో ఆర్థికంగా విధ్వంసమైంది. మేము చేస్తున్న అప్పు ఉత్పాదకతకు ఖర్చు చేస్తున్నాం. ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా బయటపడలేదు. పరిస్థితులు సానుకూలంగా లేవు. అనేక సవాళ్లు ఉన్నా అభివృద్ధి సంక్షేమంపై మా లక్ష్యాల్లో మార్పు లేదు’ అని వివరించారు.

News February 14, 2026

దివ్యాంగులకు ఫ్రీ బస్సు.. బడ్జెట్‌లో ప్రస్తావన

image

AP: రాష్ట్ర బడ్జెట్‌లో దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ‘ఇంద్రధనుస్సు’ పేరుతో అమలు చేయనున్నట్లు బడ్జెట్ ప్రతుల్లో పేర్కొంది. కాగా ప్రస్తుతం దివ్యాంగులు 50% టికెట్ సబ్సిడీతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ స్కీమ్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో వెల్లడించలేదు.

News February 14, 2026

తొందరపాటు నిర్ణయంతో 90% మంది ఫెయిల్: మంత్రి

image

AP: 2019-24 మధ్య సమగ్ర ప్రణాళిక లేకుండా చేపట్టిన సంస్కరణలతో విద్యా వ్యవస్థ వెనుకబాటుకు గురైందని మంత్రి కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘తొందరపాటు నిర్ణయంతో 1,000 స్కూళ్లను CBSE విధానానికి మార్చడం వల్ల 90% మంది విద్యార్థులు పాస్ కాలేకపోయారు. టీచర్ల సన్నద్ధత లేకపోవడంతో “టోఫెల్” ఫెయిలైంది. పరిపాలనా వైఫల్యంతో “నాడు-నేడు”లో ₹7,875Cr మౌలిక సదుపాయాల పనులు అసంపూర్తిగా మిగిలాయి’ అని వివరించారు.