News May 24, 2024
వింత పోటీ.. ఏం చేయకుండా ఖాళీగా ఉన్నవారే విజేత

సౌత్ కొరియాలో వూప్‌స్యాంగ్ అనే విజువల్ ఆర్టిస్ట్ ‘స్పేస్ ఔట్'(Do Nothing) పోటీని నిర్వహిస్తున్నారు. ఈ బిజీ లైఫ్‌లో కాస్త విరామం అవసరమనేదే ఈ పోటీ ఉద్దేశం. దీనిలో భాగంగా పోటీదారులు 90min ఏం చేయకుండా ఖాళీగా ఉండాలి. వారి హార్ట్ రేటును పరీక్షించి విజేతను ప్రకటిస్తారు. ఈ ఏడాది 4వేలకు మందికి పైగా పాల్గొనగా క్వాన్ సో-ఎ అనే ఫ్రీలాన్స్ అనౌన్సర్ గెలుపొంది ‘ది థింకర్’ శిల్పాన్ని ట్రోఫీగా అందుకున్నారు.
Similar News
News February 17, 2025
26.77 కోట్ల ‘ఉపాధి’ పనిదినాలు కేటాయించండి: కేంద్రంతో ఏపీ

AP: ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025-26 ఏడాదికి APకి 26.77 కోట్ల పనిదినాల్ని కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ అధికారుల బృందంతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శైలేశ్ కుమార్‌ను ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో భారీగా పెరిగిన కూలీల సంఖ్యకు తగ్గట్టుగా కేటాయింపులు పెంచాలని కోరారు. ఈ మేరకు ప్రతిపాదనలను ఆయనకు సమర్పించారు.
News February 17, 2025
టెక్ సదస్సులో ప్రసంగించనున్న కేటీఆర్

ఈ నెల 27, 28 తేదీల్లో బెంగళూరులో జరిగే ‘టెక్ అండ్ ఇన్నోవేషన్ సమిట్’లో పాల్గొనాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు ఆహ్వానం లభించింది. ఆ సదస్సులో ఆయన ప్రసంగించాలని నిర్వాహకులు ఆయన్ను కోరారు. ఆహ్వానాన్ని మన్నించిన కేటీఆర్, భవిష్య సాంకేతికాభివృద్ధి అనే అంశంపై కేటీఆర్ ప్రసంగిస్తారని తెలుస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ ప్రభుత్వాల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.
News February 17, 2025
ఢిల్లీ సీఎం ఎంపిక నేడే?

ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్న సస్పెన్స్‌కు నేడు తెరపడే ఛాన్స్ ఉంది. ఈరోజు రాజధానిలో జరిగే సమావేశంలో సీఎం పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఆ పేరుపై హైకమాండ్ ఇప్పటికే స్పష్టతతో ఉన్నప్పటికీ బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతోంది. కేజ్రీవాల్‌పై విజయం సాధించిన పర్వేశ్ వర్మతో పాటు మాజీ విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ, ఆశిష్ సూద్, జితేంద్ర మహాజన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.