News April 25, 2024

OTTలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ

image

మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ OTT స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. మే 3 నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా తెలుగులోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. ఓ గుహలో చిక్కుకున్న ఫ్రెండ్‌ను కాపాడేందుకు తోటి మిత్రులు చేసే పోరాటం నేపథ్యంలో డైరెక్టర్ చిదంబరం ఈ సినిమాను తెరకెక్కించారు.

Similar News

News December 11, 2025

మహిళల ఆరోగ్యానికి ఎలాంటి విటమిన్లు కావాలంటే?

image

చాలామంది మహిళలు విటమిన్ల లోపంతో బాధపడుతున్నారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. మహిళల ఆరోగ్యంలో విటమిన్లు, ఖనిజాల సమతుల్య వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు ఆరోగ్యం నుంచి హార్మోన్ల వరకు, విటమిన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విటమిన్ D3, విటమిన్ C, విటమిన్ B12, విటమిన్ B9, విటమిన్ B6తో సహా అవసరమైన విటమిన్ల సమతుల్య వినియోగం మహిళల హార్మోన్ల ఆరోగ్యానికి కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.

News December 11, 2025

గుడికి ఎందుకు వెళ్లాలి?

image

ఆలయ ప్రాంగణంలో సానుకూల శక్తి ఉంటుంది. గర్భగుడి చుట్టూ ఉండే శక్తిమంతమైన తరంగాలు మనలోని నెగటివ్‌ ఎనర్జీని తొలగిస్తాయి. గంట చప్పుడు, హారతి, పూల పరిమళం, చెప్పులు లేకుండా నడవడం, కుంకుమ ధరించడం.. ఈ ప్రక్రియలు మన పంచేంద్రియాలను జాగృతం చేస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి. తీర్థంలోని తులసి, రాగి శారీరక సమస్యలను దూరం చేస్తాయి. ప్రశాంతత, ఆరోగ్యం కోసం ఆలయాలకు వెళ్లాలి. మరింత సమాచారం కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News December 11, 2025

చలికాలం.. పాడి పశువుల సంరక్షణ (1/2)

image

రాత్రి వేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటే పశువుల షెడ్లలో కరెంటు బల్బులను ఏర్పాటు చేసి వెలుతురు, వేడిని అందించాలి. రాత్రివేళ పశువులను ఉంచే పాకలు, కొట్టాలు, షెడ్ల చుట్టూ గోనెసంచులతో లేదా తడికెలతో కప్పి ఉంచాలి. తడిగా, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలను ఉంచకూడదు. పశువులకు గోరువెచ్చని నీటిని అందించాలి. చలికాలానికి సంబంధించి పశువులకు వెటర్నరీ వైద్యులు సూచించిన మేతను అందించాలి.