News March 26, 2024
దుర్గమ్మ ప్రత్యేక దర్శనాలకు టికెట్ తప్పనిసరి

AP: విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రత్యేక దర్శనాలకు టికెట్ తప్పనిసరి చేస్తూ EO రామారావు ఆదేశాలు జారీ చేశారు. ₹100, ₹300, ₹500 టికెట్లు ఉన్నప్పటికీ కొనుగోలు చేయకుండా పలువురు సిఫార్సుల పేరుతో నేరుగా దర్శనానికి వెళ్తున్నారు. దీంతో ఆదాయం తగ్గిపోయింది. ఇకపై అంతరాలయ దర్శనం చేసుకునే భక్తులకు ₹500 టికెట్ ఉండాల్సిందేనని ఈవో స్పష్టం చేశారు. నిత్యం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.
Similar News
News April 1, 2026
ఇవాళ 11amకు YS జగన్ ప్రెస్‌మీట్

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం YS జగన్ ఇవాళ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారని ఆ పార్టీ ప్రకటించింది. ఇవాళ పార్లమెంటులో రాజధాని అమరావతి బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జగన్ ప్రెస్‌మీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధానిపై పార్టీ స్టాండ్ ఏంటో ప్రకటించే ఆస్కారముందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
News April 1, 2026
దారుణంగా పడిపోయిన ట్రంప్ రేటింగ్

ఇరాన్‌పై యుద్ధం విషయంలో మోనార్క్‌లా వ్యవహరిస్తున్న ట్రంప్‌పై నానాటికీ ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. AF పోస్ట్ ప్రకారం ఆయనపై ప్రజామోదం(నెట్ అప్రూవల్ రేటింగ్) ఏకంగా -17కు పడిపోయింది. ఆయన రెండో పదవీకాలంలో ఇదే అత్యల్పం కాగా పదవిలో ఉండగా ఏ ఒక్క US అధ్యక్షుడికి ఇంత తక్కువ రేటింగ్ లభించలేదు. ట్రంప్‌కు రిపబ్లికన్ల మద్దతు 92% నుంచి 84శాతానికి పడిపోయింది. 95% మంది డెమోక్రాట్ల నుంచి వ్యతిరేకత ఉంది.
News April 1, 2026
ముగిసిన నీలం సాహ్ని పదవీకాలం

AP: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఐదేళ్ల పదవీకాలం నిన్నటితో ముగిసింది. ఆమె స్థానంలో రిటైర్డ్ సీఎస్ నీరబ్ కుమార్, తదితరుల పేర్లు వినిపించినా నియామకం జరగలేదు. సాధారణ ఎన్నికలతో పాటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలోనూ కొత్తగా రాబోయే SEC పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న అధికారి కోసం ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు సమాచారం. 45రోజుల్లో కమిషనర్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది.


