News April 8, 2024

పీఎం మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్

image

ప్రధాని మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆయనపై ఓ ట్రాన్స్‌జెండర్‌ కూడా పోటీ చేస్తుండటం ఆసక్తికరం. అఖిల భారత హిందూ మహాసభ(ఏబీహెచ్ఎం)కు చెందిన హేమాంగి సఖి మాత బరిలో నిలిచారు. బరోడాలో జన్మించిన ఆమె ప్రపంచంలో భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ కావడం విశేషం. 2019లో ఆమె ఆచార్య మహామండలేశ్వర్‌గా పట్టాభిషిక్తులయ్యారు.

Similar News

News January 13, 2025

భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

image

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. క్యుషు ప్రాంతంలో భూప్రకంపనలు రాగా రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రత నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల నేపాల్, టిబెట్ సరిహద్దులో సంభవించిన భూకంపం ధాటికి సుమారు 200 మంది మరణించిన విషయం తెలిసిందే.

News January 13, 2025

అప్పుడు జైలుకెళ్లిన వారికి రూ.20 వేల పెన్షన్

image

1975 నుంచి 1977 మ‌ధ్య దేశంలో ఎమర్జెన్సీ అమ‌లులో ఉన్న సమయంలో జైలుకెళ్లిన వారికి నెలవారీ రూ.20,000 పెన్షన్ మంజూరు చేస్తామ‌ని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. పెన్షన్‌తో పాటు వారి వైద్య ఖర్చులనూ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, జనవరి 1, 2025 నాటికి జీవించి ఉన్న వారందరికీ ఈ సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని తెలిపింది. జైలులో ఎన్ని రోజులు ఉన్నా స‌రే వారందరూ అర్హులే అని హోం శాఖ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది.

News January 13, 2025

టెస్టు కెప్టెన్‌గా జైస్వాల్‌ను ప్రతిపాదించిన గంభీర్?

image

రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరనే దానిపై BCCI తీవ్ర కసరత్తు చేస్తోంది. నిన్న, ఈరోజు అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కోచ్ గంభీర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే వర్క్‌లోడ్ ఎక్కువవుతుందని భావించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే సెలక్షన్ కమిటీ తెరపైకి పంత్ పేరును తీసుకొచ్చిందని సమాచారం. అయితే గంభీర్ అనూహ్యంగా జైస్వాల్ పేరును ప్రతిపాదించారట. మరి దీనిపై BCCI ఏమంటుందో చూడాలి.