News January 13, 2025
భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. క్యుషు ప్రాంతంలో భూప్రకంపనలు రాగా రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రత నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల నేపాల్, టిబెట్ సరిహద్దులో సంభవించిన భూకంపం ధాటికి సుమారు 200 మంది మరణించిన విషయం తెలిసిందే.
Similar News
News February 9, 2025
ఆటోకు మూడు చక్రాలే ఎందుకు ఉంటాయంటే?

ఆటో రిక్షాలు ఎన్ని అప్డేట్స్ పొందినా మూడు చక్రాలతోనే వస్తున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఫోర్ వీల్ వాహనాల కన్నా 3 చక్రాల వాహనాలను బ్యాలెన్స్ చేయడం ఈజీ. ఇరుకు ప్రదేశాల్లో దీనిని నడపటానికి అనువుగా ఉంటుంది. దీనిని తయారు చేసేందుకు కూడా తక్కువ ఖర్చు అవుతుంది. ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది. ఆటోను నడిపేవారు ఆయిల్‌పై ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఇది ఇంకా మూడు చక్రాలతో వస్తోంది.
News February 9, 2025
భార్యపై కోపంతో భర్త ఏం చేశాడంటే?

ఓ వ్యక్తి భార్యపై కోపంతో ఆమె పేరుపై ఉన్న బైక్‌పై చలానాలు వచ్చేట్లు ప్రవర్తించాడు. పట్నాకు చెందిన ఓ వ్యక్తి ముజఫర్‌పూర్‌కు చెందిన యువతి పెళ్లైన నెలన్నరకే విడిపోయారు. ఆ యువతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ ఆమెపై కోపంతో అత్తింటి వారు ఇచ్చిన బైక్‌ను భర్త ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ నడిపాడు. బైక్ ఆమె పేరుతో ఉండటంతో చలాన్లు ఆ యువతి ఫోన్‌కు వెళ్లేవి. చలాన్లు భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించారు.
News February 9, 2025
ఒంటరిగా ఉంటున్నారా?

దీర్ఘకాలిక ఒంటరితనం శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుందని, ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ‘ఒంటరిగా ఉంటే.. మరణించే ప్రమాదం 29% పెరుగుతుంది. రోజుకు 15 సిగరెట్లు తాగడం కంటే ఎక్కువ ప్రమాదం. గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్, జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఎక్కువ. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఆందోళన పెరుగుతుంది’ అని అధ్యయనాలు చెబుతున్నాయి.