News January 18, 2025
ఎంపీతో రింకూ ఎంగేజ్‌మెంట్‌లో ట్విస్ట్!

రింకూ సింగ్, SP MP ప్రియా సరోజ్ పెళ్లి ప్రచారంపై ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇంకా వారిద్దరికి ఎంగేజ్‌మెంట్ కాలేదని ప్రియ తండ్రి తుఫానీ సరోజ్ చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. రింకూ ఫ్యామిలీ తమ పెద్ద అల్లుడితో మ్యారేజీ ప్రపోసల్ గురించి చర్చించినట్లు ఆయన చెప్పారని తెలిపింది. తమ 2 కుటుంబాల మధ్య పెళ్లి చర్చలు జరుగుతున్న మాట వాస్తవమే అయినా ఎంగేజ్‌మెంట్ జరిగిందనడంలో నిజం లేదన్నట్లు వెల్లడించింది.
Similar News
News February 10, 2025
శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఉచితంగా లడ్డూ: ఆనం

AP: ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలం బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి తెలిపారు. భక్తులకు ఇబ్బందిలేకుండా తాగునీరు, ఆహారం అందిస్తామని చెప్పారు. శ్రీశైలం పార్కింగ్ నుంచి సత్రాల వరకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ప్రతి భక్తుడికీ ఫ్రీగా లడ్డూ ప్రసాదం ఇస్తామని పేర్కొన్నారు. ఘాట్ రోడ్లపై ట్రాఫిక్‌ను డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు.
News February 10, 2025
చైనా సంక్షోభం: పెళ్లిళ్లు తగ్గి విడాకులు పెరుగుతున్నాయ్

చైనాలో పెళ్లిళ్లు తగ్గి విడాకులు పెరగడం ఆందోళనకరంగా మారింది. 2024లో 61L వివాహాలు నమోదయ్యాయి. 1986 తర్వాత ఇదే అత్యల్పం. 2023తో పోలిస్తే 20.5% తగ్గడం గమనార్హం. ఇక గత ఏడాది 26L జంటలు డివోర్స్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 28K అధికం. అలాగే ఆ దేశంలో శ్రామిక జనాభా(16-59yrs) 68L తగ్గిందని ఓ నివేదికలో వెల్లడైంది. మొత్తం జనాభాలో 60ఏళ్లకు పైగా వయసున్న వారు 22 శాతానికి పెరిగారని తేలింది.
News February 10, 2025
టీచర్ ఉద్యోగ నియామకాల ఆలస్యం.. హైకోర్టు ఆగ్రహం

TG: DSC-2008 నియామకాల ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 1,382 మందిని ఇవాళ్టిలోగా కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని <<15354548>>ఆదేశించినా<<>> అమలు చేయకపోవడంతో విద్యాశాఖపై మండిపడింది. కోర్టు ధిక్కరణగా భావించాల్సి ఉంటుందని ప్రభుత్వ న్యాయవాదిని హెచ్చరించింది. మూడు రోజుల్లోగా ప్రక్రియ పూర్తిచేస్తామని విద్యాశాఖ కమిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 17కు వాయిదా వేసింది.