News January 30, 2025

క్యాన్సర్ రాకుండా చేసే వ్యాక్సిన్ రాబోతోంది!

image

శరీరంలో క్యాన్సర్ అభివృద్ధి చెందడం కంటే ముందే దానికి కారణమయ్యే కణాలను గుర్తించి అంతం చేసే వ్యాక్సిన్ రాబోతోంది. ఫార్మాస్యూటికల్ కంపెనీ GSK, Oxford వర్సిటీ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి. బాడీలో క్యాన్సర్ వ్యాప్తి కావడానికి 20 ఏళ్ల వరకూ సమయం పడుతుందని, తాము తయారు చేసే వ్యాక్సిన్ ప్రీ కాన్సరస్ సెల్స్‌ను గుర్తించి వ్యాధి రాకుండా వాటిని అంతం చేస్తుందని వర్సిటీ ఫ్రొఫెసర్లు పేర్కొన్నారు.

Similar News

News February 19, 2025

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

image

స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది. సెన్సెక్స్ 132 పాయింట్లు తగ్గి 75,835 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 54 పాయింట్లు తగ్గి 22,890 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. టెక్ కంపెనీ టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతుండగా HDFC బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ లాభాల్లో దూసుకెళ్తున్నాయి.

News February 19, 2025

దారుణం.. బాలికపై ఏడుగురు గ్యాంగ్ రేప్

image

తమిళనాడు కోయంబత్తూర్‌లో దారుణం జరిగింది. కునియముత్తూరులో 17 ఏళ్ల బాలికపై ఏడుగురు విద్యార్థులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఇంటర్ ఫెయిలై బామ్మ ఇంట్లో ఉంటున్న బాలికకు సోషల్ మీడియాలో ఓ కాలేజీ విద్యార్థితో పరిచయమైంది. ఆమెను నమ్మించి తన గదికి రప్పించుకున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆరుగురు స్నేహితుల్ని ఆమెపైకి ఉసిగొల్పి పైశాచిక ఆనందం పొందాడు. నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

News February 19, 2025

రేవంత్‌కు రూ.4.20 లక్షల కోట్లు జరిమానా వేసినా తప్పులేదు: కేటీఆర్

image

TG: అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌కు జరిమానా వేయాలని కేటీఆర్ అన్నారు. సింగపూర్ పార్లమెంట్లో రెండు అబద్ధాలు చెప్పినా ఫైన్ వేశారని ఓ ఆర్టికల్‌ను కేటీఆర్ చేశారు. కాళేశ్వరం గురించి, రాష్ట్ర అప్పులు, హామీల గురించి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. 420 అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి రూ.4.20 లక్షల కోట్ల జరిమానా వేసినా తప్పులేదని అన్నారు.

error: Content is protected !!