News April 29, 2024
54ఏళ్లుగా ముంపు గ్రామం.. బయటపడింది
ఎల్‌నినో ప్రభావంతో ఫిలిప్పైన్స్‌లో కరవు తాండవిస్తోంది. దీంతో అక్కడి జలవనరులు మొత్తం ఎండిపోయాయి. దీంతో దాదాపు 54ఏళ్లుగా నీటిలో మునిగిపోయి ఉన్న న్యువా ఎసిజా ప్రావిన్స్‌లోని పాత పంటబాంగన్ గ్రామం బయటపడింది. కరవు వల్ల అక్కడి డ్యామ్స్‌లో సాధారణం కంటే 50మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది. మే రెండో వారం వరకూ అక్కడ ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది.
Similar News
News November 8, 2024
ప్రపంచం మారినా బాబు మారడు: విజయసాయిరెడ్డి
AP: ప్రపంచం ఎంతో మారిందని, కానీ సీఎం చంద్రబాబు మారడం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. పుట్టినప్పటి నుంచి అవే మోసాలు, అబద్ధాలు ఆడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ‘జ్ఞానం కలగాల్సిన వయసులో కూడా పాపాలు చేస్తున్నాడు. ఆయనకు ఇక నరకం సరిపోదు.. యముడు ఒక ప్రత్యేక లోకాన్ని సృష్టించాల్సిందే. చివరకు ఆ యముడిని కూడా తప్పుదోవ పట్టిస్తారేమో?’ అని ఆయన ట్వీట్ చేశారు.
News November 8, 2024
‘గేమ్ ఛేంజర్’ నుంచి స్పెషల్ పోస్టర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్ రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హీరోయిన్ కియారా అద్వానీకి చెందిన స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. సరికొత్త లుక్‌లో ఆమె ఎంతో బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలవనుంది. టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు పెరిగిపోతాయని సినీవర్గాలు భావిస్తున్నాయి.
News November 8, 2024
హషిమోటో వ్యాధితో బాధపడుతున్నా: అర్జున్ కపూర్
బాలీవుడ్ యాక్టర్ అర్జున్ కపూర్ హషిమోటో అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తల్లి, సోదరికి సైతం ఈ వ్యాధి ఉన్నట్లు తెలిపారు. దీనితో పాటు మైల్డ్ డిప్రెషన్‌కు గురైనట్లు వెల్లడించారు. కాగా హషిమోటో అనేది థైరాయిడ్ గ్రంథిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హార్మోన్ లెవల్స్‌ని తగ్గించేస్తుంది. ఊబకాయం, డయాబెటిస్ ఉన్నవారు, గతంలో కుటుంబంలో ఈ వ్యాధి ఎవరికైనా వచ్చిన వారు దీని బారిన పడుతుంటారు.