News November 23, 2024

విద్యాసంస్థలకు హెచ్చరిక.. అలా చేస్తే రూ.15లక్షల ఫైన్!

image

AP: రూల్స్ అతిక్రమించే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ హెచ్చరించింది. స్టూడెంట్స్‌కు ఒరిజినల్ ధ్రువపత్రాలు ఇవ్వకపోతే, అధిక ఫీజులు వసూలు చేస్తే రూ.15లక్షల ఫైన్ విధించడంతో పాటు గుర్తింపును రద్దు చేసే అధికారం కమిషన్‌కు ఉంటుందని గుర్తుచేసింది. ఏవైనా సమస్యలుంటే 8712627318, 08645 274445 నంబర్లలో ఫిర్యాదు చేయొచ్చని విద్యార్థులకు సూచించింది.

Similar News

News December 8, 2024

రాముడే సిగ్గుతో త‌ల‌దించుకుంటాడు: ఇల్తిజా

image

రాముడి పేరు నిన‌దించలేద‌న్న కార‌ణంతో ముస్లిం యువ‌కుల‌ను హింసించ‌డం లాంటి ఘ‌ట‌న‌ల‌తో రాముడే సిగ్గుతో త‌ల‌దించుకుంటాడ‌ని PDP నాయ‌కురాలు ఇల్తిజా ముఫ్తీ వ్యాఖ్యానించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జరిగిన ఈ ఘ‌ట‌న‌పై ఆమె స్పందిస్తూ ఇలాంటి స‌మ‌యాల్లో రాముడు సైతం నిస్స‌హాయంగా ఉండిపోతార‌ని పేర్కొన్నారు. దేవుడి పేరును చెడ‌గొడుతూ ల‌క్ష‌లాది మంది భార‌తీయుల‌ను ప‌ట్టిపీడిస్తున్న రోగం హిందుత్వమని అన్నారు.

News December 8, 2024

భారీ వర్షాలు.. రైతులకు హెచ్చరిక

image

AP: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేసింది. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటను వర్షాలకు ముందు కోయరాదని తెలిపింది. కోసినా పూర్తిగా ఆరని వాటిని కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేస్తే నష్ట శాతం నివారించవచ్చంది.

News December 8, 2024

కేసీఆర్ వారసుడెవరు? కేటీఆర్ సమాధానమిదే

image

TG: బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్‌కు వారసుడెవరనే ప్రశ్నకు కేటీఆర్ బదులిచ్చారు. గులాబీ బాసే మరో మూడు-నాలుగేళ్లలో సీఎం అవుతారని చెప్పారు. ప్రజలు, పార్టీనే వారసుడిని నిర్ణయిస్తుందని తెలిపారు. కేసీఆర్ వంటి నాయకుడి కింద పనిచేయడమే తమ అదృష్టమన్నారు. తిరిగి KCRను సీఎంగా చూడటమే తన లక్ష్యమన్నారు. ఎవరి స్థాయికి తగ్గట్లుగా వారికి పార్టీలో బాధ్యతలు ఉన్నాయని పేర్కొన్నారు.